మెహబూబా.. మెహబూబా
గుండెల్లో గుచ్చావే దిల్ రూప
మెహబూబా.. మెహబూబా
అల్లానే ఇచ్చాడే నిన్నే తోఫా
ఏ మంత్రం వేసావే నాపై నువ్వు
దాసోహమైపోయా ఈ జన్మకు
నే తప్పిపోయానే నాలో నేను
వెతికేస్తూ ఉన్నానే నీలో నన్ను
దోచేసుకున్నావే నా దిల్లును
దాచేసుకుంటానే నీ ఇష్కులు
ఈ పొరపాటే అలవాటైపోయిందే
గమ్మత్తుగా మత్తేదో కమ్మేస్తుందే
మెహబూబా.. మెహబూబా
గుండెల్లో గుచ్చావే దిల్ రూప
మెహబూబా.. మెహబూబా
అల్లానే ఇచ్చాడే నిన్నే తోఫా
నచ్చక నువ్విలా వదిలేది లేదింకా
గుండెల్లో దాచుకుంటానే…
నా తుష్కో కో గయా
తన దిల్ మే సో గయా
తుజ్సే హి జినా చాహుంగా..
మనసు మనసు నడుమ ప్రేమొచ్చి కూర్చుందే
ఏం చేయాలి..
అడుగు అడుగు అంటూ నీవైపే తోస్తుందే
పిల్ల గాలి..
ఏంటంటూ నువ్వలా అడిగేస్తే నన్నిలా
అల్లాడిపోనా నేను…
నీ పైనే ప్రేమంటూ ఓ సైగే చేసావే
నీ వైపే అడుగేస్తూ..
ఏదోలా ఉంటుందే నీ మౌనము
ఏదోటి చెప్పైవా నా కోసము
ఒంటరిగా మోస్తున్న ఈ భారము
నువ్వొచ్చి మొసైవా నాలో సగము
మెహబూబా.. మెహబూబా
గుండెల్లో గుచ్చావే దిల్ రూప
మెహబూబా.. మెహబూబా
అల్లానే ఇచ్చాడే నిన్నే తోఫా
గదులు గోడలు దాటి మది నిన్నే చేరిందే
చూడో సారి…
కసిరే చూపులతోటి నువ్వొచ్చి చంపేస్తే
ఏంటి దారి..
నా ఎదుటే ఎవరున్నా
నీ కలనే కంటున్నా
పొలమారుతుందా నీకు…
చెప్పందే ప్రేమైనా అచ్చంగా దొరికేనా
కాదంటూ తోసేయకు..
నీకోసం బ్రతికుంటా ఎన్నాలైనా
నీతోనే వస్తుంటా ఏదేమైనా
కాదన్న వదిలేదే లేదే మైనా
బతుకంతా నీతోనే జినా మరణ
మెహబూబా.. మెహబూబా
గుండెల్లో గుచ్చావే దిల్ రూప
మెహబూబా.. మెహబూబా
అల్లానే ఇచ్చాడే నిన్నే తోఫా
ఇకపైన నా అడుగే నీతోనే వేస్తాలే
నీ చేయ్యి తోడవ్వగా..
నడిచేటి దారంతా నీ కథలే వింటాలే
మన ప్రేమ సాక్షాలుగా ..
మార్చావు నన్నే నీ రూపం లాగా
బ్రతికేస్తా నువ్వే నా లోకం కాగా
ఇంకో నా పేరయ్యి నువ్వుండగా
కాస్తయినా దూరంగా పోలేనుగా
________________
Song Credits:
పాట పేరు: మెహబూబా (Mehabooba)
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మను అల్లూరి (Manu Alluri)
సంగీత దర్శకుడు: మార్క్ ప్రశాంత్ (Mark Prashanth)
గాయకులు: మార్క్ ప్రశాంత్ (Mark Prashanth) & జయశ్రీ (Jayasree)
సాహిత్యం: ప్రీతి నోవెలిన్ (Preethi Novelin)
నటీనటులు: చరణ్ గోపరాజు (Charan Goparaju), పూజా రెడ్డి బోరా (Pooja Reddy Bora)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.