Home » రాష్ట్ర నిర్మాణానికి విద్యార్థిని ముందు అడుగు 25 లక్షల విరాళం

రాష్ట్ర నిర్మాణానికి విద్యార్థిని ముందు అడుగు 25 లక్షల విరాళం

by Nikitha Kavali
0 comment
66

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం రావడం తో రాష్ట్ర రాజధానిని అమరావతి గా కాయం చేసారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అప్పుడే పనులను మొదలు పెట్టేసింది. ఇటు ప్రభుత్వ ఖర్చు ఏ కాకుండా రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి కొంత మంది దాతలు కూడా కొంత విరాళాలను అందిస్తున్నారు.

అలాగే ఏలూరు జిల్లా మదనేపల్లి కి చెందిన అంబుల వైష్ణవి అనే విద్యార్థి విజయవాడ లో ఒక మెడికల్ కాలేజీ లో చదువుతున్నారు. ఆమె రాజధాని నిర్మాణానికి ఏకంగా 25 లక్షలను రాష్ట్ర అభివృద్ధికి అందించి తన విశాల హృదయాన్ని చాటుకుంది. తన దగ్గర ఉన్న పొలం ను అమ్మగా వచ్చిన 25 లక్షలను అమరావతి నిర్మాణానికి, బంగారు గాజుల అమ్మగా వచ్చిన 1 లక్ష రూపాయలను పోలవరం నిర్మాణానికి అందించింది.

తన తండ్రి మనోజ్ తో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లి చెక్ ను అందించారు. విద్యార్థులు కూడా రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని తన లాంటి వాళ్ళు దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యం అని ముఖ్య మంత్రి ప్రశంసించారు. వైష్ణవిని రాజధాని బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం నియమించారు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version