పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నా
ముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా
పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నా
ముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా
నీ యనకేనకే ఎపుడూ నే నడిచొస్తున్నా
నీ ఎంగిలినే ఇష్టంగా తింటూ ఉన్నా
ఎంత చెప్పిన ఎంత చేసినా
ఎంత చెప్పిన ఎంత చేసినా కొంత కూడా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నన్నర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
చిన్న నాటి నుండి నీతోనే చెలిమిగా ఉన్నా
నువ్వెక్కడికెళుతున్నా నీకెదురొస్తున్నా
నీ చనువుగా నీ భుజం పైన చేయేస్తున్నా
ఆ చెయ్యను తియ్యను ఇంకో వెయ్యేళ్ళయినా
నా మనసున తనువున నువ్వే నిలిచావంటున్నా
నా మనిషివి నువ్వే నువ్వే అని అంటున్నా
నేనాడపిల్లయినా ఓ అడుగు మందేసి అనకూడనవంటూవున్నా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నన్నర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా మట్టి బుర్రా
రే అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నా మువ్వలు గలుగల్లుమని మూగైపోయే
నా గాజులు గలగలలు మరిచి గమ్మున నిలిచే
నా గోరింటాకే ఎర్రగా నన్నే చూసే
నా కాటుకు రేకే నన్నే కాటే వేసే
నా అందం చందం ఆభరణాలు అన్ని
నువ్వు ముందరలేవని నను ముద్దా ఇటు చూసి
మగవాన్ని నేనైతే మగువల్లే నువ్వొస్తే
ఇంత ఆలస్యం చేసేదాన్న
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా మట్టి బుర్రా
నన్నర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా మట్టి బుర్రా
అర్ధం చేసుకోవేంట్రా రే మట్టి బుర్రా
చిత్రం:గీతా శంకరం (Geetha Shankaram)
పాట పేరు:మట్టి బుర్ర (Matti Burra)
తారాగణం:ముఖేష్ గౌడ్, ప్రియాంక శర్మ, అజిత్ జయరాజ్, భానుశ్రీ మెహ్రా, మురళీధర్ గౌడ్, నాగ మహేష్, సురభి ప్రభావతి తదితరులు
గాయకులు:శ్వేతా మోహన్ (Swetha Mohan)
సాహిత్యం:చంద్రబోస్ (Chandrabose)
సంగీత దర్శకుడు:అబు
చిత్ర దర్శకత్వం:రుద్ర
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి