వేషము మార్చెనూ…..హోయ్
భాషను మార్చెనూ…..హోయ్
మోసము నేర్చెనూ
అసలు తానే మారెనూ
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
క్రూర మృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యముల ఆక్రమించెను
క్రూర మృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యముల ఆక్రమించెను
హిమాలయము పై జెండా పాతెను
హిమాలయము పై జెండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
వేదికలెక్కెను వాదము చేసెను
త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు
వేషము మార్చెను
భాషను మార్చెను
మోసము నేర్చెను
తలలే మార్చెను
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు
ఆ అహ హ హ హహహ
ఆ అహ హ హ హహహ
చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : ఘంటసాల
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.