Home » ప్రపంచం లో చైనా వాల్ తరువాత ఎతైన గోడ మన దేశం లోనే ఉంది ఎక్కడో తెలుసా!

ప్రపంచం లో చైనా వాల్ తరువాత ఎతైన గోడ మన దేశం లోనే ఉంది ఎక్కడో తెలుసా!

by Nikitha Kavali
0 comment

మన దేశం ఎన్నో అద్భుతాలకు మూలం. ప్రపంచం లో ఎక్కడ లేని అద్భుతాలు మన దేశం లో ఉన్నాయి కానీ మనం వాటిని గుర్తించకుండా మర్చిపోతున్నాం. అలాంటి ఒక ప్రదేశమే రాజస్థాన్ లో ఉన్న కుమ్భల్గర్హ్ కోట. మనం స్కూల్ లో చదువుకొనే అప్పుడు ది గ్రేట్ వాల్ అఫ్ చైనా ని ప్రపంచం లో నే ఎతైన గోడ గా చదివేము కానీ మనకు 2వ అతి పెద్ద గోడ అయినా ది గ్రేట్ వాల్ అఫ్ ఇండియా గురించి ఎక్కడ చదవలేదు. ఇప్పుడు కుమ్భల్గర్హ్ కోట లో ఉన్న ది గ్రేట్ వాల్ అఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం రండి. 

ఈ ప్రదేశం ఎక్కడ ఉంది?

కుంభాల్‌గర్ కోట, దీనిని ది గ్రేట్ వాల్ ఇండియా అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో ఉంది. ఇది ఉదయపూర్‌కు 82 కిలోమీటర్ల దూరంలో ఆరావళి కొండల పశ్చిమ వాలుపై ఉంది. మీరు ఉదయపూర్ నుంచి బైక్ అద్దెకు కు తీసుకొని ఇక్కడికి చేరుకోవచ్చు లేదా టాక్సీ లో వెళ్ళవచ్చు. ఉదయపూర్ నుంచి ఇక్కడికి వెళ్లే మార్గం ప్రకృతి అందాలతో మిమ్మల్ని కచ్చితంగా ఆహ్లాదపరుస్తుంది. 

కుమ్భల్గర్హ్ కోట విశేషాలు

కుంభాలగర్హ్ కోటను మీవారు గోడ అని కూడా పిలుస్తారు. ఈ కుమ్భల్గర్హ్ కోటకు చేరుకున్నాక లోపలికి వెళ్ళడానికి రూ.50 టికెట్ తీసుకోవలసి ఉంటుంది. ఈ స్థలం లోనే రాజా మహారాణా జన్మించారు.  ఈ కోట లోపల కొన్ని చిన్న గుడులు, రాజా మహల్ లు ఉన్నాయి.

ఈ కోట గోడ సుమారు 37 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. శత్రువుల నుండి తమ రాజ్యాన్ని రక్షించుకునేందుకు ఈ కోటను నిర్మించారు. ఈ కోటకు 7 ద్వారాలు, 13 పర్వత శిఖరాలు మరియు ఎన్నో క్లోక్ టవర్లు ఉన్నాయి, బహుశా ఇవే శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించాయి.

ఈ కుంభాలగర్హ్ కోట లోపల ఆ కాలం లో వాడిన కొన్ని యుద్ధ పరికరాలు కూడా ఉన్నాయి. ఒక కొండపైన ఇంత పెద్ద గోడ కట్టడం అనేది ఎంతో గొప్ప విషయంగా చెపుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు అయినా ఆ కోట గోడలు చాల దృడంగా ఉన్నాయి, ఇది మన భారత దేశ నైపుణ్యాన్ని తెలియచేస్తుంది.

కుంభాలగర్హ్ కోట పైకి చేరుకున్నాక అక్కడ నుంచి కనిపించే మేఘాల దృశ్యాలు చాల చాల బాగుంటాయి. ఇంత అద్భుతమైన గొప్ప చరిత్ర ఉండడం వలెనే ఈ ప్రదేశాన్ని UNESCO వరల్డ్ హెరిటేజ్ జాబితాలో పెట్టారు. 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ను సందర్శించండి. 

You may also like

Leave a Comment