ఒఓ.. ఒఓ.. ఒఓ.. ఒఓ..
ఒఓ ఒఓ ఒఓ ఒఓ
కుహు కుహు అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ.. బదులుగ నవ్వొకటివ్వమ్మా
హో.. కుహు కుహు అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ..బదులుగ నవ్వొకటివ్వమ్మా
ఆ నవ్వులే సిరిమల్లెలై
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకీ ఆరాటమే
చేరాలనీ జడ కుచ్చుల్లలో
ఓ ఇంధ్రధనుసే వర్ణాల వానై
కురిసెను జల జల
చిటపట చినుకులుగా
కూకూకూకూ…
కుహు కుహు అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మా.. బదులుగ నవ్వొకటివ్వమ్మా..
ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి
ఓఓ..ఒఓ..ఓఓ..ఒఓ..
ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి
సెలయేరు పైన జలతారు వీణ
పలికెను గలగల సరిగమపదనిసలా
కూకూకూకూ…
కుహు కుహు అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ.. బదులుగ నవ్వొకటివ్వమ్మా..
నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ
నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా
దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఓఓ..ఒఓ..ఓఓ..ఒఓ..హో..
నీలాల నింగీ చుక్కల్ని తెచ్చీ
నక్షత్ర మాలే వెయ్యాలీ
నీకంటి నీరూ వర్షించకుండా
దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఏ కష్టమైనా ఉంటాను తోడై
తడబడు అడుగున
జతపడి నేనున్నా
కూ..కూ..కూ..కూ… .
కుహు కుహు అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ.. బదులుగ నవ్వొకటివ్వమ్మా..
______________
Song credits:
సాంగ్: కోయిలమ్మ (Koyilamma)
చిత్రం: సీత (Sita)
గాయకుడు: అర్మాన్ మాలిక్ (Armaan Malik)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
దర్శకత్వం: తేజ (Teja)
లిరిక్స్: లక్ష్మీ భూపాల్ (Lakshmi Bhupal)
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.