పరిపూర్ణమైన ప్రశాంతత, ప్రకృతి అందాల మేళవింపు, సముద్రపు అలల సంగీతం, పచ్చదనం నిండిన కొండలు, క్రిస్టల్ క్లియర్ వాటర్ – ఇవన్నీ ఒకే చోట కనిపించే చోటు క్రాబి (Krabi) ప్రావిన్స్. ఇది థాయిలాండ్‌లో ఉంది.
మన జీవితంలో కొన్ని ప్రదేశాలు విసిట్ చేసినప్పుడు మన హృదయంలో శాశ్వతంగా ముద్రపడతాయి… అలాంటిది డెస్టినేషన్ కి సరైన ప్రదేశం క్రాబి (Krabi), థాయిలాండ్.
ఫ్లైట్ దిగిన వెంటనే కనిపించిన ఆ పచ్చదనం, ఆ నీలికంటుల సముద్రం, కొండలు… ఏదో ఒక సినిమాటిక్ ప్రపంచంలోకి వచ్చేశానేమో అనిపిస్తుంది.
📍క్రాబి (Krabi) ఎక్కడుంది? ఎలా చేరుకోవాలి?
క్రాబి (Krabi) అనేది థాయిలాండ్ (Thailand) దేశం లోని దక్షిణ భాగంలో, అండమాన్ సముద్ర తీరాన ఉన్న ఒక ప్రశాంతమైన బీచ్ ప్రావిన్స్. పెద్దగా ట్రాఫిక్ లేని, కమర్షియల్ హడావుడి తక్కువగా ఉండే నేచర్ స్పాట్‌లకు ఇది పుట్టినిల్లు! పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok) నుండి ఫ్లైట్ లో అయితే సుమారు 1.5 గంటలు, లేదా ఫుకెట్ (Phuket) నుండి 2-3 గంటల బస్సు ప్రయాణం చేస్తే క్రాబి (Krabi) కి చేరవచ్చు.ఇది టూరిస్ట్ క్రౌడ్ ఎక్కువగా ఉండే ఫుకెట్ (Phuket) కంటే చాలా ప్రశాంతమైన, చూడదగ్గ ప్రదేశం
క్రాబి (Krabi) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బ్యాంకాక్ (Bangkok), చైయాంగ్ మై (Chiang Mai) లాంటి పెద్ద నగరాల నుండి డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి.
రోడ్డు ద్వారా అయితే ఫుకెట్, ట్రాంగ్, హాటై లాంటి దగ్గర నగరాల నుండి బస్సులు/టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. సముద్ర మార్గం కూడా ఉంది. ఫుకెట్ లేదా ఫి ఫి ఐలాండ్ (Phi Phi Islands) నుండి బోట్ ద్వారా కూడా రీచ్ అవ్వచ్చు.
🏖️ క్రాబి (Krabi) లో చూడవలసిన టాప్ ప్రదేశాలు:
1. ఏవో నంగ్ బీచ్ (Ao Nang Beach) – టూరిస్ట్ హబ్
క్రాబి (Krabi) లో స్టే చేసే వాళ్లకు ఇది మేజర్ బేస్ బీచ్ . ఈ బీచ్ లో సాయంత్రం నడవడమూ, రాత్రికి స్ట్రీట్ ఫుడ్ మజాను ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా ఎన్నో బోట్ రైడ్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి.
హైలైట్స్
- బీచ్ ఫ్రంట్ రెస్టారెంట్లు
- మసాజ్ లు మరియు స్పాస్ (Massages and spas)
2. రైలే బీచ్ (Railay Beach) – ఒక సినిమాటిక్ బ్యూటీ !
సాధారణ రోడ్డుమార్గంలో కాకుండా, ఈ బీచ్ కి రీచ్ అవ్వాలంటే బోటులో వెళ్లాలి. కానీ మీరు అడుగుపెట్టిన వెంటనే, ఎలాంటి మాటలు రావు… ఎందుకంటే అక్కడి ప్రకృతి మాటలకందదు! అంత అద్భుతంగా ఉంటుంది.
హైలైట్స్
- రాక్ క్లైంబింగ్ కార్యకలాపాలు
- ఫ్రా నాంగ్ గుహ బీచ్
- కలలా అనిపించే సూర్యాస్తమయాలు

.3. ఫి ఫి ఐలాండ్స్ (Phi Phi Islands) – ఒక నమ్మలేని స్వర్గం
“ది బీచ్ (The Beach)” సినిమా తర్వాత ఈ ఐలాండ్స్ చాల ఫేమస్ అయినాయి. ఇక్కడ ఉండే క్రిస్టల్ క్లియర్ వాటర్, రంగురంగుల పగడపు దిబ్బలు, స్నార్కెలింగ్, కొండల దృశ్యాలు – అబ్బా ఒకటేమిటి అన్నీ ఈ ఐలాండ్ చూడవచ్చు!
హైలైట్స్
- మాయ బే
- వైకింగ్ కేవ్
- మంకీ బీచ్
- లోహ్ సమా బే వద్ద స్నార్కెలింగ్
అయితే ఇవన్నీ పగటి సమయంలో చూడడానికి ప్రయత్నం చేయండి. మరింత మంచి అనుభూతిని పొందుతారు.
4. ఎమెరాల్డ్ పూల్ & హాట్ స్ప్రింగ్స్ – ప్రకృతి స్నానం
ఇక్కడ స్విమ్మింగ్ కచ్చితంగా ట్రై చేయాలసిందే ! ఈ నేచురల్ పూల్స్ లో నీళ్లు ఎప్పుడూ చల్లగా, ఎమరాల్డ్ కలర్‌తో మెరిసిపోతుంటాయి.
పక్కనే ఉన్న హాట్ స్ప్రింగ్స్‌లో ఒకసారి నీవు కూర్చుంటే, బాడీ లోని అలసటంతా కరిగిపోతుంది.
5. టైగర్ కేవ్ టెంపుల్ (Tiger Cave Temple) – కొండపై నడకతో రీచ్ అయ్యే దైవికత
టైగర్ కేవ్ టెంపుల్ కొండపై ఉన్న ఒక పవిత్రమైన ఆలయం. ఈ టెంపుల్ పైకి చేరాలంటే 1,260 మెట్లు ఎక్కాలి – కానీ పైకి వెళ్ళాక కనిపించే 360° వ్యూ మరిచిపోలేరు. మీరు మెట్లు ఎక్కిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోతుంది.

🍛 Food & Local Culture
క్రాబి (Krabi) అనేది స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి ఒక స్వర్గం. ఇది కేవలం బీచ్ బ్యూటీయే కాదు, టేస్ట్ బ్యూటీ కూడా!
తప్పక రుచి చూడాల్సినవి
- పాడ్ థాయ్ న్యూడిల్స్
- టామ్ యుమ్ సూప్
- మాంగో స్టిక్కీ రైస్
- ఫ్రెష్ కోకోనట్ ఐస్క్రీమ్
- థాయ్ మిల్క్ టీ
ఇక వారాంతాల్లో ఉండే కాబ్రి టౌన్ నైట్ మార్కెట్, వాకింగ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ల్స్.
ఎవరు ఏక్కడ ఉండాలి
క్రాబి (Krabi) లో స్టే కోసం ఎంచుకోవచ్చిన కొన్ని ప్రాంతాలు:
ఏవో నంగ్ బీచ్ (Ao Nang Beach) – బీచ్ కి దగ్గర, టూరిస్ట్ హబ్
క్రాబి టౌన్ : బడ్జెట్ ఫ్రెండ్లీ & లోకల్ టచ్ ఉంటుంది
రైలే : ఐలాండ్ లవర్స్ కి మంచి ఎక్సపీరియెన్స్ ఇస్తుంది.
💡 Travel Tips:
నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు వెళ్తే బెస్ట్ క్లైమేట్ ఉంటుంది.
లాంగ్ టైల్ బోట్స్ రైడ్ కి వెళ్లే వారు ధర ముందుగానే అడిగి తేల్చుకొని రైడ్ చేయండి.
క్యాష్ ఎప్పుడూ మీవద్ద ఉంచుకోండి – చిన్న చిన్న స్టాల్స్ లో కార్డ్స్ తీసుకోరు.
క్రాబి (Krabi) ఇది ఎవర్ని అయినా తనలో కలిపేసే ప్రదేశం. మీరు ఒంటరిగా వెళ్తే బాగా కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీతో వెళ్తే మరపురాని క్షణాలు లభిస్తాయి, ఫ్రెండ్స్‌తో వెళ్తే అడ్వెంచర్ ట్రిప్ అవుతుంది.
ఇలాంటి మరిన్ని వాటికోసం చూడండి తెలుగురీడర్స్