ఆ కొండగట్టు అంజన్నకి నే సెప్పుకున్న బాధనే .. నే సెప్పుకున్న బాధనే
ఆ సీతారాముల్నే కలిపినట్టుగా నిన్ను నన్ను కలుపుతాడని .. నిన్ను నన్ను కలుపుతాడని
ఆ శివుడిలోనే పార్వతమ్మకి సగభాగమే ఇచ్చాడని
నా దేహమంత నీ కోవెలయి నిన్ను పూజిస్తూ ఉంటిని
ఇంతలోనే అంత ప్రేమని కాలదన్నుకొని పోతివి
మాటకైన సెప్పభోతివి ఇంతదూరం ఎట్టా వెలితివి
గాయమైన నా గుండెని ఇంకా కొట్టి కొట్టి సంపుతుంటివి
మరిసి పోలేకపోతున్నానమ్మా
నన్ను బాధల్లో ముంచెత్తకమ్మా
నిన్ను ప్రాణంగా ప్రేమిస్తినమ్మా
నన్ను పిచ్చోణ్ణి సెయొద్దే బొమ్మా
మరిసి పోలేకపోతున్నానమ్మా
నన్ను బాధల్లో ముంచెత్తకమ్మా
నిన్ను ప్రాణంగా ప్రేమిస్తినమ్మా
నన్ను పిచ్చోణ్ణి సెయొద్దే బొమ్మా
ఒట్టువెట్టుకున్న నా మనసుల
నీకై కట్టుకున్న గుడినే గుండెల
నువ్వే మారిపోయి ఓ వెన్నెల
నన్ను ముంచిపోతావేందే భాదల
దేవతల్లే పూజిస్తే నిన్ను
ఒంటరోన్నే చేస్తివే నన్ను
ఒక్క మాట నువ్వడిగిసూడు
ప్రణమిస్తానే అమ్మ తోడు
గుండెనంత ముక్కలు చేసిన
నువ్వే కావాలంటినే
మరిసి పోలేకపోతున్నానమ్మా
నన్ను బాధల్లో ముంచెత్తకమ్మా
నిన్ను ప్రాణంగా ప్రేమిస్తినమ్మా
నన్ను పిచ్చోణ్ణి సెయొద్దే బొమ్మా
మరిసి పోలేకపోతున్నానమ్మా
నన్ను బాధల్లో ముంచెత్తకమ్మా
నిన్ను ప్రాణంగా ప్రేమిస్తినమ్మా
నన్ను పిచ్చోణ్ణి సెయొద్దే బొమ్మా
నేను నమ్ముకున్నగదనే నిన్నిలా
ఎట్టా వదిలి పోతున్నావే నన్నిలా
తప్పుజేసింది అంతా నువ్వేగా
ఈ శిక్ష ఎందుకింక నాకిలా
నమ్ముకున్న నీ ప్రేమ నేనే
ఆడుకోకే నాతోనే నువ్వే
ఇంకో ఏలే నువ్వట్టుకున్నా
ప్రేమ సావదు ఈ గుండె లోన
కంటి నిండా నీ ఊహలతోనే
కాటికి బోతూ ఉంటిని
మరిసి పోలేకపోతున్నానమ్మా
నన్ను బాధల్లో ముంచెత్తకమ్మా
నిన్ను ప్రాణంగా ప్రేమిస్తినమ్మా
నన్ను పిచ్చోణ్ణి సెయొద్దే బొమ్మా
మరిసి పోలేకపోతున్నానమ్మా
నన్ను బాధల్లో ముంచెత్తకమ్మా
నిన్ను ప్రాణంగా ప్రేమిస్తినమ్మా
నన్ను పిచ్చోణ్ణి సెయొద్దే బొమ్మా
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!