Home » కరుకు చూపు కుర్రోడా నాతో కడవరకు వస్తావా సాంగ్ లిరిక్స్

కరుకు చూపు కుర్రోడా నాతో కడవరకు వస్తావా సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
0 comment

కరుకు చూపు కుర్రోడా నాతో కడవరకు వస్తావా
మల్లెపూవు మనసోడా నాకే ముద్దులముడి వేస్తావా
కాలాన్నే..మన్నవని..కౌగిలినే.. విడువనని హ హ..
నీ మీసమ్మీద వొట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా వొందేళ్లు ప్రేమ పంచిస్తావా

ఒంటరిదాన్ని సానా ఇది నీళ్లులేనిమీన
పసుపుతాడు తోనా నీ వశం అయిపోతున్నా
అందం అనే సిరిలో అంతులేని దాన
గుండెలోతుల్లోన నిను దాచిపెట్టుకోనా
గలగల గాజులు చేతుల కోసం నాలో మోజులు నీకోసం
పువ్వుల వెన్నెల నీ ఒడి కోసం నాలో వన్నెలు నీకోసం
చుక్కలది లెక్కలది టక్కున లెక్క తేలిపొద్దే
అదేమిటో నీ వొంటిపై పుట్టుమచ్చ లెక్క తేలదే

నీ మీసమ్మీద వొట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా వొందేళ్లు ప్రేమ పంచిస్తావా
కరుకుచూపు కుర్రోడా నాతో కడవరకు వస్తావా
మల్లెపూవు మనసోడా

ఏ పాశం నిండిన ఎదలో నే వాసం ఉండిపోనా
వారంతీరక మునుపే మధుమాసం తెప్పించైనా
జామురాతిరేళా నీ జతే చేరుకోనా
నువ్వొక ముద్దు ఇస్తే జంట చక్కెరకేళై పుయ్యనా
పిలువకముందే పలికేస్తున్నా అడగకముందే ఇచ్చేయనా
నీ చిరునవ్వులే చాలంటున్నా చితినుంచైనా వచ్చేయనా

ఉసురుని ఊపిరిని ఏనాడో నీకు ఇచ్చుకున్నా
ఏడేడు నా జన్మలకి ఏడడుగులు ఇవ్వగలవా
నీ మీసమ్మీద వొట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా వొందేళ్లు ప్రేమ పంచిస్తావా
కరుకుచూపు కుర్రోడా

చిత్రం: రాయుడు
సంగీతం: డి. ఇమ్మాన్
సాహిత్యం: శ్రీమణి
గాయకులూ: వందన శ్రీనివాసన్, జితిన్ రాజ్, జయమూర్తి
దర్శకుడు: ముతియహ్
నటులు: విశాల్, శ్రీదివ్య

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment