Home » కళ్యాణం కమనీయం సాంగ్ లిరికల్

కళ్యాణం కమనీయం సాంగ్ లిరికల్

by Vinod G
0 comments

సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు
కోటి భక్తుల మదిలో కోదండ రాముడు
పరమ పావన రాముడు..

చీకటిని చీల్చిన ఆ నింగి సూర్యుడు
రావణుని హతమార్చిన అయోధ్య రాముడు
రామ లక్షణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు..

మూడు ముళ్ల బంధము జరిగెను శుభలగ్నము
సీత రాముడు ఒకటయ్యేను ఈ దినము
ఎడడుగుల పయనము ఒకరికొకరు సొంతము
కలిసి మెలిసి సాగేను ఈ జీవితము
శతమానం భవతి అని వధువరులను దీవించి
శ్రీరస్తు శుభమస్తని అతిధిలు ఆశీర్వదించి
పంచభూతాల నడుమ రెండు మనసులు ఏకమయ్యే

కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను
కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను
మూడు ముళ్ల బంధము జరిగెను శుభలగ్నము
సీత రాముడు ఒకటయ్యేను ఈ దినము

శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి
కనులు కనులు కలిపి ప్రేమమనస్సులొలికి
పులా వాన కురిసి నింగి నేల మురిసి
ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి
సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో
సీతమ్మ గుండెలో రామయ్య రూపము
నిండూనూరేళ్లు వర్ధిల్లాలని జనసంద్రం
ఏడూ జన్మలూ ఏకమవ్వాలని కలకాలం
ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం

కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను
కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను

కస్తూరి నుదుట దిద్ది దిష్టిచుక్క పెట్టి
చేతి గాజులు తొడిగి కాళ్లకు పారాణి పూసి
పులా పల్లకీలొచ్చి పెళ్లి పీటలెక్కి
తలపైన ఒట్టు వేసి జిలకర బెల్లంబెట్టి
పుట్టింటి గడపను దాటి పెళ్లికూతురు
మెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు

ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పుసహనశీలిగా
కష్టసుఖములోన సగపాలు త్యాగశీలిగా
ముసినవ్వులతో ముక్కోటి దేవతల సాక్షిగా
కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను
కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను

పసుపుతాడు మేడలో పదిలముంది యదలో
చిటికెనేలు ముడితో చివరివరకు జతలో
తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో
కలవరించే కలలు నెరవేరెను నిజదశలో
సంసార సాగరం సంతాన జీవితం
తలరాత సంతకం అయ్యింది మీవరం
వేదమంత్రాలతోని వెదజల్లెను వైభోగం
భాజాభజంత్రిలతో బంధుమిత్రుల ఆనందం
కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం

కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను
కళ్యాణం కమనీయమయాను
మాంగల్యం మహనీయమయాను


ఇలాంటి మరిన్ని వాటికోసం చూడండి తెలుగురీడర్స్

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.