Home » కల్కి స్టోరీ చెప్పేసిన… డైరెక్టర్ నాగ్ అశ్విన్

కల్కి స్టోరీ చెప్పేసిన… డైరెక్టర్ నాగ్ అశ్విన్

by Vinod G
0 comment
82

హాయ్ తెలుగు రీడర్స్! మనం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న “కల్కి” సినిమా రిలీజ్ టైం దగ్గర పడిందోయ్, “ఏంటి స్టోరీ చెప్పేశారా డైరెక్టర్ నాగ్ అశ్విన్” అని అనుకుంటున్నారా! అవును నాగ్ అశ్విన్ ఓ వీడియో స్టేట్ మెంట్ ద్వారా స్టోరీ రివీల్ చేసాడండోయ్. విషయంలోకి వెళితే మనం చిన్నతనంలో చూసిన స్టార్ వార్స్ లాంటి సినిమాలు అంటే మనకి ఎంతో ఇష్టం కానీ అందులో వుండే స్టోరీలు మనవి అయితే ఇంకా బావుండు అనిపిస్తుంటుంది. అలాగే మన దగ్గర కూడా ఎన్నో పౌరాణిక సినిమాలు, ప్రత్యేకించి పాతాళభైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369, లాంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వున్నాయి, ఇంకా రామాయణం, మహాభారతం లాంటి గొప్ప గొప్ప స్టోరీలు కూడా వున్నాయి. ఈ స్టోరీలను హాలీవుడ్ రేంజ్ లో ఎందుకు చూపించుకోలేము? ఈ మన స్టోరీలను ఒక స్టార్ వార్స్ లాగ హాలీవుడ్ రేంజ్ లో ఉంటే బాగుండు! అనే ఆలోచన నుండి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ కల్కి మూవీనీ తెరెకెక్కించడం జరిగిందన్నారు. అయితే ఈ ఆలోచన ద్వారా ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు సమయం పట్టిందని చెప్పారు.

కథ విషయానికి వస్తే మహాభారతం శ్రీకృష్ణుడి మరణం తరువాత ముగుస్తుంది. కానీ ఈ కథ శ్రీకృష్ణుడి మరణం తరువాత మొదలై కలియుగం గురించి తెలియచేస్తుంది. ముఖ్యంగా ఈ కథ మనం ఇప్పటి వరకు చదివిన గ్రంధాలు కావచ్చు లేక వివిధ పురాణాలు ఇంకా అనేక వాటికీ క్లైమాక్స్ ఇస్తుందని డైరెక్టర్ తెలియచేస్తున్నారు. అంటే శ్రీకృష్ణుడి మరణం తరువాత కలియుగంలో ఎం జరగబోతుంది? ఎలా జరగవచ్చు? అనే దాని మీద కథ వెళుతుందని తెలియచేస్తున్నారు. ఈ కథ కేవలం ఇండియాకే కాక ప్రపంచం మొత్తానికి వర్తించేవిధంగా ఉంటుందట.

ఇక టైటిల్ లో వుండే 2898 AD విషయానికి వస్తే, ఈ 2898 AD టైటిల్ లో ఎంధుకు వుంది అంటే, ఆ రోజున కలియుగం ముగుస్తుందని అర్ధం. అంటే 2898AD నుండి మనం 6000 సంవత్సరాలు వెనకకు వెళితే 3102 BC వస్తుంది, ఈ 3102BC లోనే శ్రీకృష్ణుడు మరణించాడు. మన కల్కి మూవీ శ్రీకృష్ణుడి మరణం తరువాత అంటే 3102BC మొదలై 2898AD లో ముగుస్తుందని అర్ధం. అంటే ఈ టైం పీరియడ్ మధ్యలో వుండే 6000 సంవత్సరాలు ఎం జరింగింది? ఎం జరగబోతుంది? అనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీ లో మనకు చూపించబోతున్నారని మనకు అర్ధమవుతుంది.

అయితే మన రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ఎం రోల్ చేస్తున్నాడు? అసలు సింగల్ రోల్ చేస్తున్నాడా లేదంటే మల్టిబుల్ రోల్స్ ఏమైనా చేస్తున్నాడా? అసలు ఆ ట్రైలర్ లో ఎలివేషన్స్ ఏంటి ఓ రేంజ్ లో వున్నాయి? ఇలాంటి డౌట్స్ వస్తున్నాయా! అయితే సిద్ధం గా వుండండి జూన్ 27(2024) కోసం.

మరిన్ని ఇటువంటి సినీవిశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సినీ విశేషాలు ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version