ఈ ఆర్టికల్ రాసే ముందు నాగ్ అశ్విన్ గారికి నా వందనాలు. అసలు ఆ ఆలోచనలకి, ఆ ప్రతిభకి తను పాత్రలను పొందుపరిచిన విధానానికి ఏ మాటలు రావడంలేదు. సినిమా అంటే ఎలా ఉండాలి దానికోసం ఎవరు వోచ్చిన కేవలం సినిమా కోసమే అన్నట్లు ఒప్పించి చేయడం చాల గొప్ప విషయం.
ఈ సినిమా ప్రభాస్ ఫాన్స్ కోసం కాదు, లోకనాయకుడైన కమల్ హస్సన్ ఫ్యాన్స్ కోసం కాదు, దీపికా, అమితాబ్, కీర్తి సురేష్ ఎవరి అభిమానుల కోసం కాదు ఇది ఒక ప్రపంచం మెచ్చుకోదగిన, ఆమోదించదగిన ఒక భారతీయ ఇతిహాసాలనుండి తీసుకున్న ఒక కళాత్మకమైన అద్భుతం..
కల్కి సినిమా విషయానికొస్తే మీరు ఒక సినిమా చూడడానికి, లేదా ఇతిహాసాల మీద కనీస జ్ఞానం వుండి, సినిమా అంటే కేవలం పాత్రలు అందులోని భావాలను పలకగలిగే యాక్టర్స్ కోసం మాత్రమే వెళ్లగలిగితే మీకు అత్యంత అద్భుతమైన అనుభూతిని, భవిష్యత్తు ని అనూభూతి చెంది బయటకు రాగలరు. చాల వరకు ఆశ్చర్యం కలిగించే క్యారెక్టర్స్ ఈ సినిమా సొంతం. చూసి కచ్చితంగా ఆనందిస్తారు..
లేదా నా పక్కన కూర్చొని జబర్దస్త్ డైలాగ్స్ వేసుకుంటూ ప్రతి సీన్ కి ఉచ్చు ఉచ్చు అంటూ నిట్టూర్పుతూ, అశ్వర్దమా, సుమతిని కాపాడటానికి వొస్తే సుమతి కడుపుకి అశ్వర్దమా తండ్రి అని పిచ్చి కూతలు కూస్తూ కూర్చుంటారు. వీళ్ళవల్ల సినిమా చూసే వాళ్ళకి కూడా మూడు ఉచ్చాహం అన్ని పోయి నీరసించి పోయి కోపాలు తెచ్చుకొని ఎదవలని ఏం చేయలేము అని ప్రశాంతంగా వుండి రావాలి.
ఇది కేవలం సినిమా మీద అభిమానం తో సినిమా మీద ఎటువంటి అంచనాలు లేకుండా చూసిన తరువాత రాసిన పదాలు… ఒక్క ముక్కలో చెప్పే రివ్యూలు నెత్తి నోరు కొట్టుకొని అరిచి పసలేని ప్రాసలతో యూట్యూబ్ లో వొచ్చే రివ్యూ కాదు.. సినిమా మీద ప్రేమతో ఇచ్చే రివ్యూ.. స్టోరీ తెలుసుకొని సినిమాకెళ్లి ఏం ఎంజాయ్ చేస్తారు బ్రో..