జాడైట్ అరుదైన మరియు విలువైన రత్నం, ఇది ఆకుపచ్చ రంగులో మృదువుగా ఉంటుంది. ఇది సోడియం అధికంగా ఉండే పైరోక్సిన్ ఖనిజం, NaAlSi2O6 దాని కెమికల్ ఫార్ములా. జాడైట్ బ్రైట్ కలర్ లో స్పష్టమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ రంగును “ఇంపీరియల్ గ్రీన్” లేదా “వివిడ్ గ్రీన్” గా అని అంటారు.
ఈ రత్నాలను ఆభరణాలుగా ధరించవచ్చు. ఉదాహరణకు ఉంగరాలు, గొలుసులు, మరియు పెండెంట్ లాగా తాయారు చేయించుకుని ధరించవచ్చు. ఇవి మంచి రిచ్ లుక్ ని ఇస్తాయి.
జడైట్ మొహ్స్ స్కేల్ పై 6.5-7 వరకు కఠినత్వం (hardness) ఉంటుంది. ఈ రత్నం ఖరీదు అయినది కాబట్టి గీతాలు పడకుండా, దెబ్బతినకుండా జాగ్రత్తగా చూడడం చాలా ముఖ్యం. జడేట్ నెఫ్రైట్ కంటే చాలా అరుదుగా ఉండే ఖనిజం. ఇది అంత అరుదైనది కాబట్టి కొనుగోలు దారులు ఈ జాడైట్‌ను ఎక్కువగా కోరుకునేలా చేస్తుంది.
మయన్మార్, గ్వాటెమాల, రష్యా మరియు ఇంకొన్ని ఇతర ప్రాంతాలలో మాత్రమే జాడైట్ దొరుకుతుంది. మంచి క్వాలిటీ జాడేట్ రత్నాలు ఎక్కువుగా మయన్మార్ నుండి వస్తాయి. మయన్మార్ ప్రాంతంలో కొన్ని శతాబ్దాలుగా ఈ ఖనిజాలు తవ్వబడుతున్నాయి. “జడేట్” ముఖ్యంగా ఆసియా కల్చర్స్ లో అదృష్టం కలిగించే రత్నంగా భావిస్తారు.
అధిక-నాణ్యత జాడైట్ రత్నాలు చాలా విలువైనవి, ప్రతి క్యారెట్ ధర వజ్రాల కంటే ఎక్కువగా ఉంటుంది. పేరున్న డీలర్‌లతో కలిసి పనిచేయడానికి దాని నాణ్యతను తెలుసుకోవడానికి సర్టిఫికేట్ పొందడం చాలా అవసరం. జాడేట్ రత్నాలకు రంగును పెంచడానికి వేడి చేయవచ్చు, ఇది దాని విలువను పెంచుతుంది. సరైన సంరక్షణ తో జాడేట్ రత్నాలను చూసుకుంటే, రాబోయే తరాలకు విలువైన ఆస్తిగా మారుతాయి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ఫ్యాషన్ ను చుడండి.