Home » వర్షా కాలంలో మీ మొబైల్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే IP రేటింగ్ గురించి తెలుసుకోండి 

వర్షా కాలంలో మీ మొబైల్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే IP రేటింగ్ గురించి తెలుసుకోండి 

by Nikitha Kavali
0 comment

IP అంటే INGRESS  ప్రొటెక్షన్. IP రేటింగ్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న గణాంకాల పట్టి. ఇది మన ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రకృతి కారకరాలకు వ్యతిరేకంగా ఎంత ఎంత రక్షణని అందిస్తుందో తెలిపేది. ఈ IP రేటింగ్ లో రెండు అంకెలు ఉంటాయి. వాటిలో మొదటి అంకె ఆ పరికరం ఎంత వరకు దుమ్ము నుండి రక్షణని అందిస్తుందో సూచిస్తుంది. మరియు రెండో అంకె ఆ పరికరం నీటి నుండి ఎంత ఎంత వరకు రక్షణను ఇస్తుంది అనేది సూచిస్తుంది. ఇంకా సులభంగా చెప్పాలి అంటే IP రేటింగ్ అనేది  ఒక ఎలెక్ట్రానిక్ పరికరం కి డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ యొక్క కెపాసిటీ ని లేదా లెవెల్స్ ని తెలిపేది.

IP రేటింగ్ స్కేల్:

డస్ట్ ప్రూఫ్ కెపాసిటీ 
0డస్ట్ నుండి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. 
150mm కన్నా ఎక్కువ సైజు ఉన్న డస్ట్ పార్టికల్స్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. 
212mm కన్నా ఎక్కువ సైజు ఉన్న డస్ట్ పార్టికల్స్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. 
32.5mm కన్నా ఎక్కువ సైజు ఉన్న డస్ట్ పార్టికల్స్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది.
41.0mm కన్నా ఎక్కువ సైజు ఉన్న డస్ట్ పార్టికల్స్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది.
5ఎటువంటి చిన్న డస్ట్ పార్టికల్స్ నుంచి అయినా ప్రొటెక్షన్ ఇస్తుంది.
6సూక్ష్మమైన డస్ట్ నుంచి కూడా చాల స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. 
వాటర్ ప్రూఫ్ కెపాసిటీ 
0నీటి నుండి ఎటువంటి రక్షణ ఉండదు.
1నిలువుగా కారుతున్న నీటి నుండి రక్షించబడింది.
215° వరకు వంగి ఉన్నప్పుడు నీటి చుక్కల నుండి రక్షించబడుతుంది.
3నిలువు నుండి 60° కోణంలో నీటిని చల్లడం నుండి రక్షించబడుతుంది.
4ఆవరణ 15° వరకు ఏ కోణంలోనైనా వంగి ఉన్నప్పుడు నీరు స్ప్లాషింగ్ నుండి రక్షించబడుతుంది.
5ఏ దిశ నుండి నీటి జెట్ నుండి రక్షించబడింది
6స్వల్పకాలిక ఇమ్మర్షన్ ప్రభావాల నుండి రక్షించబడింది (ఒత్తిడి మరియు సమయం యొక్క నిర్వచించబడిన పరిస్థితులలో).
7భారీ సముద్రాలు లేదా శక్తివంతమైన నీటి జెట్‌ల నుండి రక్షించబడింది.
8సబ్మెర్షన్ నుండి రక్షించబడింది (తయారీదారు పేర్కొన్న పరిస్థితులలో).
9kసమీప-శ్రేణి అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత స్ప్రే డౌన్స్ నుండి రక్షించబడింది.

IP69K అంటే ఏమిటి?

IP69k అనేది డివైస్ లకు ఎటువంటి డస్ట్, నీటి నుంచి అయినా అత్యంత రక్షణ కల్పిస్తుంది. ఈ IP69k సర్టిఫికెట్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా ఇండస్ట్రీ లలో  హై ప్రెషర్, టెంపరేచర్ లో కూడా బాగా చేస్తాయి. ఈ రేటింగ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యధిక రక్షణ.

IP రేటింగ్ టెస్టులు ఎలా చేస్తారు:

ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు IP రేటింగ్ ఇవ్వాలి అంటే వాటిని కొన్ని సవాలు విసిరే  పరీక్షలకు పెడతారు. అధిక ప్రెషర్, ఉష్ణోగ్రతలు, మరియు ధూళి కి ఆయా పరికరాలను చోచుపోకుండా ఉన్నాయా లేదా అని పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలలో ఎంత నెగ్గితే ఆ పరికరాలకు అంత ఎక్కువ IP రేటింగ్ ను ఇస్తారు.

ఈసారి మీరు ఏదైనా మొబైల్ ఫోన్ లు అలాంటివి కొనేటప్పుడు కచ్చితంగా IP రేటింగ్ ను పరిశించండి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ని సందర్శించండి.

You may also like

Leave a Comment