ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయి
పెళ్లింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి
ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయి
పెళ్లింట సప్పుడు కేకలు కడుతున్నాయి
ఇంచక్కా సిర్రా పట్టి దరువేయమన్నాయి
ఇంటోడే ఇంటిదంతో సింధేయమాన్నయి
ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయి
పెళ్లింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి
ప్రేమ ఏ రంగులో ఉన్నదో
చేతి గోరింట చెబుతున్నది
అచ్చు ఆ రంగు నీ చెంప పై
నీడలా నేడు పడుతున్నది
ప్రేమ సవ్వళ్ళు నా గుండె చప్పుళ్ళు
మోసుకెల్లేటి ఈ మేళ తాళాలన
నా కల ఇదే కదా
నీ కల అదే కదా
ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయి
ఇస్తట్లో రుచులే ఇప్పుడు చూడాలన్నాయి
ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయి
పందిట్లో గుమ గుమ మల్లెలే కందితున్నాయి
కర్పూరం వాసనాలెన్నో కలబడుతున్నాయి
కడకంటా కమ్మగా కాపురముండాలన్నాయి
ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయి
ఇస్తట్లో రుచులే ఇప్పుడు చూడాలన్నాయి
ప్రేమ ఏ రుచిని కలిగున్నదో నోట నీ పేరు చెబుతున్నది
అచ్చు ఆ రుచిని వందేళ్ళకి అనుభవించాలని ఉన్నది
ప్రేమ గంధాలు నీ నుంచి నా దాకా చేరవేయాలని శ్వాస కడదాకా
నా కల ఇదే కదా
నీ కల అదే కదా
పందిరి మంచం కిటకిటలు
పంచె జుబ్బా మిటమిటలు
పాల గలాసు పట్టేదాకా పిల్లోడి లోపల పిటపిటలూ
పిల్లోడి లోపల పిటపిటలూ
తలుపుల సప్పుడు ఇనుకోగానే తలుపుల సప్పుడు ఇనుకోగానే
తల్లోన మొదలాయె తటపటలు
సిన్నదని సిగ్గుల సిటపటలు
పరదాల సాటున పటపటలు||3||
ప్రేమ ఏ హాయి ఇస్తున్నదో
మబ్బు నను తాకి చెబుతున్నది
అచ్చు ఆ హాయి నీ స్పర్శతో కలిగి ఎద వేణువవుతున్నది
నువ్వు ఇష్టాంగా ఇచ్చేటి తొలి ముద్దు
నన్ను తెన్నెల్లో ముంచాలి ఈ పొద్దు
ఓ ప్రియా ఓహో ప్రియా నా జత నువ్వే కదా
చిత్రం: సైజు జీరో
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గాయకులూ: మధుమిత, రమ్య బెహరా పాలక్ ముచ్చల్.
నటులు: అనుష్క శెట్టి, ఆర్య, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహన్, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.