Home » ఇంట్లో ఈ మొక్కలు పెంచితే పాములు రావు

ఇంట్లో ఈ మొక్కలు పెంచితే పాములు రావు

by Rahila SK
0 comment
71

పాములకు కొన్ని మొక్కల వాసన పడదు… వీటిని ఇళ్ల దగ్గర పెంచితే పాములు రావు. ముఖ్యంగా పాములు కొన్ని ప్రత్యేక వాసనలను ఇష్టపడవు, అవి పాముల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఈ వాసనలలో కొన్ని ముఖ్యమైన మొక్కలు మరియు వాటి వాసనల గురించి వివరించబడింది.

  • బంతిపువ్వు (Marigolds): బంతిపూల పరిమళం పాములకు పడదు. ఈ మొక్కలను ఇంటి ద్వారాలు, చుట్టుపక్కల పంచడం మేలు.
  • లెమన్ గ్రాస్ (Lemongrass): లెమన్ గ్రాస్ మంచి సుహాసనని వెదజల్లుతుంది. దీన్ని ఇంటి పరిసరాల్లో పంచితే పాములు రావు.
  • స్నేక్ ప్లాంట్ (Snake Plant): స్నేక్ ప్లాంట్ని ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు ఇళ్లలో చాలా అందంగా కనిపిస్తాయి. పైగా ఈ మొక్కలు పెంచడానికి ఎక్కువ మెయింటెనెన్స్ అక్కర్లేదు. ఈ మొక్కలు ఇళ్లలో ఉంటే, పాములు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
  • కొత్తిమీర (Wormwood): వార్మ్వుడ్, కొత్తిమీర ఆకుల లాగా కనిపించే ఈ ముక్క కూడా పాములకు శత్రువే. దీని పరిమళం పాములకు నచ్చదు.
  • ఫ్రిటిల్లారియా (Fritillaria): ఈ పూల మొక్కను చక్కెర లిల్లీ అని కూడా అంటారు. ఈ ఫ్రిటిల్లారియా కూడా పాముల్ని దగ్గరకు రానివ్వదు.
  • లావెండర్ (Lavender): లావెండర్ పువ్వుల మొక్క పరిమళం మతేక్కిస్తోంది. ఈ సుహాసన పాములకు నచ్చదు.
  • ఉల్లి మరియు వెల్లుల్లి (Onion and Garlic): ఉల్లి మరియు వెల్లుల్లి ఘాటు వాసనను పాములు క్షణం కూడా భరించలేవు.
  • సర్పగంధ (Indian Snakeroot): ఈ మొక్క నుంచి పరిమళాలు చాలా దూరం వస్తాయి. ఆ వాసన పాములకు నచ్చదు. అందువల్ల ఈ మొక్క ఉంటే, ఇంటి దరిదాపుల్లోకి సర్పాలు రావు. దీని పాతాళ గరుడ మొక్క అని కూడా అంటారు.
  • కాక్టస్ (Cactus): ముళ్లతో కూడిన కాక్టస్ మొక్కలు పాములకు దూరంగా ఉండటానికి సహాయపడతాయి. పాములు ముళ్లలో దాక్కోవడం ఇష్టపడరు.
  • గరుడ చెట్టు: ఈ చెట్టు పండు పాముల విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది మరియు పాములకు దూరంగా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది.
  • తులసీ (Tulsi): తులసీ పాములకు అసహ్యంగా ఉంటుంది. దీనిలోని వాసన పాములను దూరంగా ఉంచుతుంది.
  • నిమ్మ (Lemon): నిమ్మ పండ్ల వాసన కూడా పాములకు ఇష్టంకాదు. ఇది పాములను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
  • సోంపు (Fennel): సోంపు వాసన కూడా పాములకు అసహ్యంగా ఉంటుంది, ఇది పాములను దూరంగా ఉంచుతుంది.

ఈ మొక్కలను ఇంటి చుట్టుపక్కల పెంచడం ద్వారా, పాములు ఇంటి దగ్గరకు రావడం నిరోధించవచ్చు. తద్వారా మీ ఇంటి భద్రతకు కూడా తోడ్పడుతుంది. ఈ విధంగా, ఈ మొక్కలు పాముల నుండి రక్షణ కల్పించడానికి సహాయపడతాయి.

ఇలాంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వ్యవసాయం ను సంప్రదించండి.

You may also like

Leave a Comment

Exit mobile version