Home » ఇంట్లోనే ఇలా సులభంగా స్వచ్ఛమైన కుంకుమ ను తయారు చేసుకుందాం రండి

ఇంట్లోనే ఇలా సులభంగా స్వచ్ఛమైన కుంకుమ ను తయారు చేసుకుందాం రండి

by Nikitha Kavali
0 comment

మన భారతీయ ఇళ్లల్లో కుంకుమ ఎంతో శుభ ప్రదమైనది.  శుభకార్యాలలో పసుపు తో పాటు కుంకుమ ని కూడా జత చేర్చి ఇస్తుంటాము. కుంకుమ మనకి ఎంతో పవిత్రమైనది. కానీ అలాంటి కుంకుమ ఇప్పుడు మార్కెట్లలో రంగు చల్లి కల్తీ చేసి  అమ్ముతున్నారు. మనం కుంకుమను దేవుడికి మరియు శుభకార్యాలలో వాడుతాము కాబట్టి అది ఎంత స్వచ్చంగా ఉంటె మనకు ఫలితాలు కూడా శుభప్రదంగా వస్తాయి. అందుకనే ఇప్పుడు కుంకుమను మన ఇంట్లో నే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. 

కుంకుమ తయారు చేసే విధానం:

ముందు గా పసుపు కొమ్ములను తీసుకొని కొంచెం కడిగి ఆరబెట్టండి. ఇప్పుడు నీళ్లల్లో నిమ్మరసం, స్పటిక పొడి వేసి బాగా కలపండి. ఆ నీళ్లల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములను ఒక 4 రోజుల వరకు ఊరబెట్టండి. ఆలా నానబెట్టిన పసుపు కొమ్ములను ఇప్పుడు రెండు రోజులు బాగా ఎండకి ఎండ పెట్టండి.

ఆ కొమ్ములు బాగా ఎండిన తర్వాత ఇప్పుడు లోపల బీట్రూట్ రంగు లో ఉంటుంది. ఇప్పుడు వాటిని బాగా మెత్తటి పొడి లా అయ్యేంత వరకు దంచండి. ఇప్పుడు కుంకుమ మంచి సువాసన రావడం కోసం కొద్దిగా జాజి కాయ పొడి ని కూడా కలపండి. అంతేను అండి ఇంట్లో నే సహజంగా స్వచ్ఛమైన కుంకుమ తయారు అయిపోతుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment