ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమాన్
అతులిత బలధాముడ జయహా హనుమాన్
అరె బల బల బజరంగీ భువనా తనయా
భక్తకోటి నేలేటి మారుతి రాయ
సూర్యున్నే పండనుకుని మింగబోయిన
వానరుల అధిపతి వాయు పుత్రుడా
జై జై జై జయహా హనుమా
కేసరీ నందనా మమ్ములగనుమా
జై జై జయహా హనుమా
నీ భక్తుల కాపాడే పవనా తనయ
ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమాన్
అతులిత బలధాముడ జయహా హనుమాన్
అరె బల బల బజరంగీ భువనా తనయా
భక్తకోటి నేలేటి మారుతి రాయ
నీ రోమ రోమాన రాముని నామం
నీ గుండెలో నిలిచింది సీతారామం
చందనాల రంగైన వజ్రదేహం
భజేవాయుపుత్రం భజేవాళగాత్రం
హిందూ ధర్మానికే రక్షకుడై
రుద్ర రూపమే ఆ బ్రహ్మ తేజం
జై జై జై జయహా హనుమా
వీరధీ వీరుడా మమ్ములగనుమా
జై జై జై జై జయహా హనుమా
కేసరీ నందనా మా మొర వినుమా
ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమాన్
అతులిత బలధాముడ జయహా హనుమాన్
అరె బల బల బజరంగీ భువనా తనయా
భక్తకోటి నేలేటి మారుతి రాయ
సీతమ్మ జాడకై వారధి గట్టి
రావణ లంకకే నిప్పును బెట్టే
అశోక వనములో అమ్మను జూసి
బంగారు ఉంగరాన్ని రామునికిచ్చే
రాక్షలందరిని గడగడ లాడించి
రామలక్ష్మణులకు అండగా నిలిచే
జై జై జై జయహా హనుమా
కేసరీ నందనా మమ్ములగనుమా
జై జై జయహా హనుమా
నీ భక్తుల కాపాడే పవనా తనయ
ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమాన్
అతులిత బలధాముడ జయహా హనుమాన్
అరె బల బల బజరంగీ భువనా తనయా
భక్తకోటి నేలేటి మారుతి రాయ
ఎహె జెండాపై కపిరాజై ఎగిరిన సౌర్యం
మా పల్లె పల్లెలకు రక్షణ కవచం
తిరుగు లేనిది హనుమంతుని ధ్యానం
మృత్యువునే వణికించే జంజ మార్గం
కాషాయం తనువంతా దగ దగ మెరిసే
అకాండ భరతవని అద్భుతమని కొలిచే
జై జై జై జయహా హనుమా
వీరధీ వీరుడా మమ్ములగనుమా
జై జై జై జై జయహా హనుమా
కేసరీ నందనా మా మొర వినుమా
ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమాన్
అతులిత బలధాముడ జయహా హనుమాన్
అరె బల బల బజరంగీ భువనా తనయా
భక్తకోటి నేలేటి మారుతి రాయ
👉 మరిన్ని ఇటువంటి వారికోసం చూడండి తెలుగురీడర్స్ లిరిక్స్