జపాన్ కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా తాజాగా హైడ్రోజన్ ప్యూయల్ సెల్ తో నడిచే కారును రూపొందించి. హోండా మోడల్స్ లోని సీఆర్- వి మోడల్ ఎస్ యూవీకి అవరమైన మార్పుల చేసి హైడ్రోజన్ ప్యూయల్ సెలతో నడిచేలా సీఆర్ వీ. ఈఎఫ్ఈవీ మోడల్ కు రూపకల్పన చేసింది ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ప్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్లు తయారీ సంస్థ జనరల్ మోటార్స్ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ప్యూయర్ సెల్ మాడ్యూల్స్ లోని 110 వోల్టుల పవర్ ಔట్ లేట్ ద్వారా ఇంజిన్ కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే ఇది ఏకంగా 435 కిలోమీటర్లు వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హొండా మోటర్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్ లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను సందర్శించండి.