Home » గుండెలో వాలవా (Gundelo Valava) సాంగ్ లిరిక్స్ – ఈశ్వర్ (Eshwar)

గుండెలో వాలవా (Gundelo Valava) సాంగ్ లిరిక్స్ – ఈశ్వర్ (Eshwar)

by Rahila SK
0 comments

గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా
నీడవై చాటుగా వున్నావుగా
మాటలే చేత కాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖ చేరనే లేదుగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా

నీ వెంటే తరుముతు ఉంటె
అసలు కన్నెత్తి చూసావా నన్ను
మరి నీ ముందే తిరుగుతూ ఉంటె
ఎపుడు పన్నెత్తి పిలిచావా నన్ను
రోజు ఇలా ఈ గాలిలా
నీ చెవిని తాకేది నేనేగా
మామూలుగా మాటాడక
ఈ గాలి గోలేంటి చిత్రంగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా
నీడవై చాటుగా వున్నావుగా

కాస్తైనా చోరవ చెయ్యందె
వరస కలిపేదెలాగంటా నీతో
నువ్వు కొంతైనా చనువు ఇవ్వందె
తెల్సుకోలేను నీ సంగతేదో
వెంటాడక వేటాడక
వలలోన పడుతుందా వలపైనా
నన్నింతగా వేధించక
మన్నించి మానసివ్వు ఇపుడైనా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా

గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్ళలో చేరవా తొలి వేలుగా
నీడవై చాటుగా వున్నావుగా
మాటలే చేత కాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖ చేరనే లేదుగా
కలుసుకో త్వరగా కళలు నిజమవగా


చిత్రం: ఈశ్వర్ (2002)
పాట: గుండెలో వాలవా (Gundelo Valava)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: రాజేష్, ఉష (Rajesh,Usha)
తారాగణం: ప్రభాస్ (Prabhas), శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్ (R.P Patnaik)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment