సూడు సూడు ఓదెలపల్లె గ్రహణమిడిసిన పున్నమల్లే
రాకాసోని పీడాపోయిన ఏకచక్రపురమల్లే
నింగిలోని సుక్కలన్నీ ముంగిళ్ళలో ముగ్గులల్లే
శంకరుని పాదం మీద మోకరిల్లే మారిడళ్లే
గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియరే
సూడు సూడు ఓదెలపల్లె గ్రహణమిడిసిన పున్నమల్లే
రాకాసోని పీడాపోయిన ఏకచక్రపురమల్లే
నింగిలోని సుక్కలన్నీ ముంగిళ్ళలో ముగ్గులల్లే
శంకరుని పాదం మీద మోకరిల్లే మారిడళ్లే
గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియరే
వరిదుబ్బు ఊరి పోరి పైట సూడరో
ఆ కారుమబ్బుల బారులు నీలి కురులు సూడరో
గునుగుపూలు మెళ్లో ఎండి గొలుసులాయరో
జీడిగింజ పల్లె పిల్ల జిస్టి దీసేరో
వాగువంక వడ్డాణంగా సుట్టుకున్న బుట్టాబొమ్మ
తుమ్మకాయ కాలిపట్టీలెట్టుకున్న పాప
సూడు గుడ్లమీది కోడి
పల్లె అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా కొక్కొరొకోయని
గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియరే
దొప్పలోని తాటికల్లు నవ్వుగంటివా
దుప్పెదాగే నురుగుపాలే నవ్వులింటివా
గిన్నెలుడికే పాసంబువ్వ నవ్వు కమ్మగా
కన్నెపిల్ల పెదవి చిరునవ్వు గుమ్ముగా
సిన్ననాడు అమ్మ కాళ్ళ మెట్టే సప్పుడింటే సాలు
ఊయలూగే సిట్టితల్లీ బోసినవ్వులోలె
నేడు నవ్వుతుంది పల్లెటూరు
అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా అహహహ ఆ హయని
గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియ గియ గియ
గా గియ గియరే
సూడు సూడు ఓదెలపల్లె గ్రహణమిడిసిన పున్నమల్లే
రాకాసోని పీడాపోయిన ఏకచక్రపురమల్లే
నింగిలోని సుక్కలన్నీ ముంగిళ్ళలో ముగ్గులల్లే
శంకరుని పాదం మీద మోకరిల్లే మారిడళ్లే
పాట పేరు: గియ గియ జాయ్ ఆఫ్ ఓదెల (Giya Giya Joy Of Odela)
సినిమా పేరు: ఓదెల 2 (Odela 2)
గానం: శ్రీ కృష్ణ (Sri Krishna)
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja)
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ (Ajanish Loknath)
రచయిత & దర్శకుడు: అశోక్ తేజ (Ashok Teja)
తారాగణం: తమన్నా (Tamannaah), సంపత్ నంది (Sampath Nandi) తదితరులు
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ చూడండి