Home » ఘల్ ఘల్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

ఘల్ ఘల్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

by Rahila SK
0 comments

పాట: ఘల్ ఘల్
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: S.P.బాలసుబ్రహ్మణ్యం
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్


ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్

ఆకాశం తాకేలా వడ గాలై ఈ నెల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడి గానం ప్రేమంటే

అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆఅ పరుగే ప్రణయానికి శ్రీకారం

దాహంలో మునిగిన చివురుకి
చల్లని తన చేయందించి
స్నేహం తో మొలకెతించే చినుకే ప్రేమంటే
మేఘం లో నిద్దుర పోయిన
రంగులు అన్ని రప్పించి
మాగాణి ముంగిట పెట్టె ముగ్గే ప్రేమంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్

ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుపగల తేదీ ఏదో
గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో
గమనించే సమయం ఉంటుందా

ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే
ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే

అది చరితాలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగేమాలెరుగని మధురిమా ప్రేమంటే

ధరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే
సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్

మండే కొలిమినడగాంధే
తెలియదే మన్ను కాదు
ఇది స్వర్ణమంటూ చూపాలంటే
పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి
పోటే చేసిన మేలంటే

తనువంతా విరబూసే
గాయాలే వరమళై
ధరి చేరే ప్రియురాలే గెలుపంటే

తాను కొలువై వుండే విలువే ఉంటే
అలంటి మనసుకి తనంత థానే
అడగక దొరికే వరమే వలపంటే

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
నడకలో తడబడిన నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో
ఎర్ర బడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువ్వేతికే సంక్రాంతాయి ఎదురవధ

ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్
గాలం గాలం ఘల్ ఘల్

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment