Home » మెంతులు, ఉల్లిపాయలతో హెయిర్ మాస్క్ ఇలా వేసుకోండి.

మెంతులు, ఉల్లిపాయలతో హెయిర్ మాస్క్ ఇలా వేసుకోండి.

by Nikitha Kavali
0 comment

మెంతులు ఉల్లిపాయల పేస్ట్ జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి, వెంట్రుకలు చివర చిట్లకుండా చూస్తాయి. అంతే గాక మెంతులు మన శరీరం లో వేడి ని కూడా తగ్గిస్తుంది. అలంటి మెంతులు, ఉల్లిపాయల పేస్ట్ మన జుట్టు కి ఎలా వాడాలో తెలుసుకుందాం రండి.

కావలసినవి:

మెంతులు-1కప్పు

ఉల్లిపాయలు-2 మీడియం సైజు

నిమ్మకాయ-1

ముందుగా మెంతులను ఒక కప్పు తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు నానబెట్టిన మెంతులను, రెండు ఉల్లిపాయలను మిక్సీ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఇప్పుడు ఈ మెంతుల ఉల్లిపాయ పేస్ట్ లో ఒక నిమ్మకాయ ని పిండాలి. నిమ్మకాలయ చుండ్రు ని తొలగించడం లో సహాయపడుతుంది.

ఇక దీని పేస్ట్ ని చిక్కగా ఉండేటు చూసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ని తల అంత పట్టించాలి. పట్టించాక ఒక గంట సేపు అలానే ఉంచాలి. అది బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు లేక ఒకసారి అయినా పట్టిస్తే దృఢమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఇటువంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment