Home » ఎవరో చూడాలి (Evaro Choodali) సాంగ్ లిరిక్స్ – పౌర్ణమి (Pournamy)

ఎవరో చూడాలి (Evaro Choodali) సాంగ్ లిరిక్స్ – పౌర్ణమి (Pournamy)

by Vinod G
0 comments
evaro choodali song lyrics pournami

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండా గాలి
వు అంటూ తరలి రాదా నింగే పొంగి పొరలి

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి

హోఓ

తనలో చినుకే బరువై కరి మబ్బే వదిలినా
చెరలో కునుకే కరువై కల వరమే తరిమినా

వనమే నన్ను తన వొడిలో అమ్మయి పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని

నెమ్మదిగా నా మది కి నమ్మకమందించేదెవరో

ఎవరో

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి

హోం వరసై కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో

ఎపుడో కన్నా తీపి కల ఎదురవుతుంటే దీపికల
శిలలో వున్నా శిల్ప కళా నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో

ఎవరో


పాట పేరు: ఎవరో చూడాలి (Evaro Choodali)
సినిమా పేరు: పౌర్ణమి (Pournamy)
గానం: కె. ఎస్. చిత్ర (K. S. Chithra), సాగర్ (Sagar)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
రచయిత & దర్శకుడు: ప్రభు దేవా (Prabhu Deva)
తారాగణం: ప్రభాస్ (Prabhas), త్రిష (Trisha), చార్మి (Charmi) తదితరులు

ఇలాంటి మరిన్ని వాటికోసం చూడండి, తెలుగురీడర్స్

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.