Home » Eswara Parameswara Song Lyrics

Eswara Parameswara Song Lyrics

by Nikitha Kavali
0 comments
Eeswara Parameswara Song Lyrics Uppena

“ఈశ్వరా” పాట ఉప్పెన సినిమాలోని ఒక భావోద్వేగ పాట. ఈ పాట సినిమా కథలో కీలకమైన సందర్భంలో వస్తుంది, ఆసి (వైష్ణవ్ తేజ్) మరియు బేబమ్మ (కృతి శెట్టి) తమ ప్రేమకు ఎదురైన విఘ్నాలను హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేస్తుంది. పాటలోని సంగీతం, సాహిత్యం మనసును కలచివేస్తాయి, ముఖ్యంగా సినిమాటిక్ విజువల్స్ ఆ భావోద్వేగాన్ని రెట్టింపు చేస్తాయి.

ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బ్రతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను నుదిటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా

దారి ఎదో తీరం ఎదో గమనమేదో గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా
చీకటేదో వెలుతురేదో మంచి ఎదో మంట ఎదో
లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా

నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా

మసక బారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగు లాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులువై ఎదురవ్వరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా

పాట: ఈశ్వర పరమేశ్వర
చిత్రం: ఉప్పెన
గాయకులూ: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
సాహిత్యం: చంద్ర బోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
దర్శకుడు: బూచి బాబు సన
నటి నటులు: పంజా వైష్ణవ తేజ్ (Panja Vaishav Tej), కృతి శెట్టి (Krithi Shetty), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), తదితరులు.

Dhak Dhak Dhak Song Lyrics Uppena

Silaka Silaka Song Lyrics Uppena

Sandramlona Neerantha song Lyrics Uppena

Ranguladhukunna Song Lyrics Uppena

Nee Kannu Neeli Samudram Song Lyrics Uppena

jala Jala Jalapatham Song lyrics Uppena

Ninne Naa Ninne Song Lyrics Uppena

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

Recent Articles

Featured

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.