ఎన్నోన్నో వర్ణాలు – ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

by Kusuma Putturu

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు

ఒకటైతే మిగిలేది తెలుపేనండి

నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం

నాకోసం మీ ఇష్టం వదలొద్దండి

మీ మది తొందర చేసే 

బాటలు వీడక మీరు సాగిపోండిక

ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా

ఎన్నెన్నో వర్ణాలు

నేనంటు ప్రత్యేకం నాదంటూ ఓ లోకం

పడలేను ఏ జోక్యం అంతేనండి

బాగుంది మీ టేస్ట్ నాకెంతో నచ్చేట్టు

మనసెంతో మెచ్చేట్టు మీ మీ మీదొట్టు

అందుకనే దిగివచ్చా 

వంచని నా తల వంచా స్నేహ భావమా

అందుకనే దిగివచ్చా 

వంచని నా తల వంచా స్నేహ భావమా

కల నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే

నేనంటు ప్రత్యేకం నా దంటూ ఓ లోకం

పడలేను ఏ జోక్యం అంతేనండి

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like