Home » ఎమున్నాడే పిల్లాడు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

ఎమున్నాడే పిల్లాడు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comments

ఎమున్నాడే పిల్లడు ఎమున్నాడే
నా మదిలో దూరి తీనుమారు అడుతున్నడే
ఎమున్నాడే పిల్లడు ఎమున్నాడే
నా హీరో అతడే లవ్వులోన ముంచేశాడే
ఆరడుగులా బుల్లెట్లా మస్తుగున్నడాడే
చూడగానే గుండెలోకి దూసుకొచ్చినాడే

వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే

మాయజేస్తడో మంత్రమేస్తడో గుర్తుకొస్తడు పిల్లడే
ఇంటిగుట్టునే బయటపెట్టి నా వెంట తిప్పుకుంటాడే

దగ్గరుంటడు దూరమంటడు అర్దమవ్వడు పిల్లడే
ఏమి జెప్పనే ఎంత జెప్పనే నన్నుజంపుతున్నాడే

కసురుకుంటడు కయ్య్ మంటడు కొడతనంటూ వస్తాడే
కన్నుగొట్టినా సైగజేసినా అస్సలట్టించుకోడే

ఎం చేయనే సూర్యుడిలాగ కాల్చుతున్నడే
చూడబోతే చెంద్రుడి లాగే ముద్దుకుంటడాడే

వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
వాడు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
వాడు చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే

సెల్లుఫోనులో సొల్లుమాటలే ఎందుకంటడు పిల్లడే
సెరువు గట్టునా పలకరించిన కనికరించకున్నాడే

గుండె నిండుగా ప్రాణమంతగా మనసుపడ్డరా పిల్లడా
నెలతల్లికి ఓ బాధ చెప్పి నా మొక్కు చెప్పుకున్నారా

కనులపండగే ఎదుటవుండగా వలపు గుట్టు విప్పాడే
పంట నీరునే ఆపలేనులే గెలుపు తలుపు తెరిచాడే

నీ ప్రేమలో ముత్యంలా మెరిసిపోతినల్లే
అందమైన లోకంలోకి తీసుకెళ్త నిన్నే

నువ్వు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
నీ చూపుతాకిందంటే నా వొళ్ళు జల్లంటుందే
నువ్వు నవ్వుతా ఉంటే నా గుండె గుల్లవుతుందే
నీ చూపు తాకుతువుంటే నా వొళ్ళు జల్లంటుందే

హే.. హే… హే…..


సిన్న సిన్న సింతల బావయో సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment