Home » విద్యుత్తుతో నడిచే మోటారు పడవ

విద్యుత్తుతో నడిచే మోటారు పడవ

by Rahila SK
0 comment

అమెరికన్ స్పోర్ట్స్ బోట్స్ తయరీ సంస్థ ఆర్క్ తాజాగా విద్యుత్తుతో నడిచే మోటారు పడవను విడుదల చేసింది. ఇందులోని 570 హార్స్‌పవర్ మోటారు పూర్తిగా బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. మోటారు నడిచేందుకు 226 కడబ్ల్యూహెచ్ రీచార్జబుల్ బ్యాటరీని అమర్చారు. పవర్ బ్యాంక్ ను వెంట తీసుకు వెళ్లాట్లయితే, ప్రయణం మధ్యలో కూడా ఈ బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.

ఆర్క్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ వేక్ బోట్ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ మోటారు పడవలో పదిహేను మంది ప్రయాణించవచ్చు. ఏ మాత్రం కర్చన ఉద్గారాలను విడుదల చేయని రీతిలో దీనిని రూపొందించారు. విహార యత్రల కోసం నదీ ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా ఆనువుగా ఉంటుంది. ప్రయాణికులకు విశాలమైన స్థలం, పడవను సునాయాసంగా నడవడానికి అవసరమైన అధునాతన సాంకేతికత, ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు ప్రయాణికులకు నీడనివ్వడానికి ఆటోమేటిక్ గా పనిచేసే పైకప్పు వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మోటరు పడవ ధర 2,58,000 డాలర్లు(రూ. 2. 15 కోట్లు).

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ను చుడండి.

You may also like

Leave a Comment