Home » ఎదుట నిలిచింది సాంగ్-వాన మూవీ

ఎదుట నిలిచింది సాంగ్-వాన మూవీ

by Nithishma Vulli
0 comments

మ్యూజిక్: కమలాకర్

లిరిక్స్: సిరివెన్నెల

సింగర్స్: కార్తీక్

నిర్మాత: ఎమ్.ఎస్. రాజు

దర్శకుడు: ఎమ్.ఎస్. రాజు

Vana%20movie

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో

మైమరిచిపోయా మాయలో

ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి

కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ

అవునో .. కాదో .. అడగకుంది నా మౌనం

చెలివో .. శిలవో .. తెలియకుంది నీ రూపం

చెలిమి బంధమల్లుకుందే .. జన్మ ఖైదులా

ఎదుట నిలిచింది చూడు

నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ

వినేవారు లేకా విసుక్కుంది నా కేకా

నీదో .. కాదో .. వ్రాసున్న చిరునామా

ఉందో .. లేదో .. ఆ చోట నా ప్రేమా

వరం లాంటి శాపమేదో సొంతమైందిలా

ఎదుట నిలిచింది చూడు

జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో

మైమరిచిపోయా మాయలో

ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా

ఎదుట నిలిచింది చూడు

మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

You may also like

Leave a Comment