ఆహా దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు
దారిద్దునా పోనిద్దునా
జోరు మీద అత్తుండు కారు మీద అత్తండు
తోలేద్దునా పోనీ ఉకుంద్దునా
దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు పోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుత్తుండు నా ముందుటుంటుండు
సంధిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంటా పోతాండు అనుకుంటా వతాండు
బందైదునా బంధమై చూపనా
ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా.. అహహా
అహ ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా ఇన్నీ గోలిద్దునా
రాయే పోయే అంటుండు రౌసు పెట్టుకుంటుండు
రమ్మందునా విన్నీ పొమ్మందునా
గాలి గాలిజేత్తుండు గరమైదునా
సోయి లేకంటుండు సంధుద్దునా
గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి
గాలిగాలి చేత్తుండు గడుసుదాన్ని అంటుండు
తల తింటాడే తరమైతలే
సోయి లేకంటుండు సోపతైతాంటాండు
సోయి ఉన్నదో వీనికి సోకున్నదో
ఆహా తిప్పిచుకుంటుండు తప్పిచుకుంటుండు
ఒప్పిద్దునా విన్నీ తప్పిద్దునా
ఈడైతానంటుండు జోడైతానంటుండు
ఇరిసేద్దునా విన్నీ మరిసుందునా
తిప్పిచుకుంటుండు తింగరోడే
తప్పించుకుంటుండు తిక్కలోడే
వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి
వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు
రానియ్యడే ముందుపోనియ్యడే
ఆగమైతంటుండు అంగడైతంటుండు
ఎగైతాడో వీడేమైతాడో
ఆహా ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి
వెనక రావోయి నా వెంట రావోయ్
నీ మీద మనసయింది వరసైతే కలిసింది
ఇడిసుండకొయ్ పిల్లగా మరిసుండకొయ్
నాగు పాము కోపమొడే జెర్రు పోతు పిరుకోడే
అగ్గగో అగ్గగో అగ్గగో అగ్గగో
అగ్గగో కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న
కంటసూడే మమ్ము జంట చెయ్యే
ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న
అన్ని కలిసే తొవ్వ చూపరాదే
పర్వతాల మల్లన్న పప్పతి పడుతున్న
మరవబాకే మమ్ము కలుపరాదే
ఎములాడ రాజన్న కోడినే కడుతాను
ఎంబాటుండేటోన్ని పిలవరాదే
________________
Song Credits:
సంగీతం : మదీన్ Sk (Madeen Sk)
సాహిత్యం: మామిడి మౌనిక (Mamidi Mounika)
గాయని : మామిడి మౌనిక (Mamidi Mounika)
డోప్ ఎడిటింగ్ డి & డైరెక్టర్ : శివ వేలుపుల (Shiva Velupula)
నిర్మాతలు: నవీన్ కొండ్రా (Naveen Kondra) & కొడ్నూర్ శ్రవణ్ (Kodnur Sravan)
నటుడు : సుబ్బి సుబ్బడు (Subbi Subbadu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.