మనం తీసుకునే ఆహరం లో మనకి ప్రోటీన్లు బాగా అవసరం. అటువంటి ప్రొటీన్ల కోసం మనం ఎక్కువగా ఆహరం తో తీసుకునేది చికెన్. చికెన్ మాంసమే కాకుండా వాటి గుడ్లను కచ్చితంగా ప్రతిరోజు తీసుకుంటాము. మనం తినే చికెన్ మనకి సాధారణ ధరలలోనే దొరుకుతుంది. కానీ ప్రపంచం లో చాల ఖరీదైన చికెన్ చాల ఉన్నాయి వాటి ధరలు సుమారు ఎన్నో లక్షలలో ఉంటాయి. ఆ చికెన్ బ్రీడ్లు వాటి ప్రత్యేకతలను ఈ సంచికలో తెలుసుకుందాం రండి.
ఖరీదైన చికెన్ బ్రీడ్ల జాబితా:
ప్రపంచం పలు దేశాలలో ఒక్కో జాతి కి సంబందించిన కోడిలు కొన్ని బాగా అరుదైనవి మరియు ఖరీదైనవి. అటువంటి జాబితాలో మొదటగా వచ్చే బ్రీడ్లు:
అయం సెమని (Ayam Cemani)
డాంగ్ టావో(Dong Tao)
డెత్ లేయర్ (Deathlayer)
లైజ్ ఫైటర్(Liege Fighter)
ఒరస్ట్ (Orust)
ఒలాండ్స్క్ డ్వార్ఫ్ (Olandsk Dwarf)
స్వేడిష్ బ్లాక్ (Swedish Black)
బ్రేస్స్ (Bresse)
బ్రహ్మ (Brahma)
కడకనాథ్ (Kadaknath)
అయం సెమని (Ayam Cemani):
ప్రపంచం లోనే ప్రత్యేకమైన మరియు ఖరీదైన చికెన్ బ్రీడ్లు అనగానే ముందు లిస్టులోకి వచ్చే కోడి అయం సెమని. దీని ప్రత్యేకతలను మనం చూస్తే ఇది చాల నలుపు రంగులో ఉంటుంది ఎంత అంటే దీని మాంసం, ఈకలు, ఎముకలు, కూడా నల్లగా ఉంటాయి. ఈ రకం కోడి ఎక్కువగా ఇండోనేషియా లోని జావా (JAVA) ప్రాంతంలో దొరుకుతుంది. ఈ కోడి లో ప్రోటీన్ శాతం మాములు బ్రీడ్లు తో పోలిస్తే చాల అధికంగా ఉంటాయి. ఇది ఒక్క కోడి సుమారు 21,35,000 వరకు ధర పలుకుతాయి.
డాంగ్ టావో(Dong Tao):
అయం సెమని తర్వాత బాగా పాపులారిటీ ఉన్న కోడి డాంగ్ టావో. ఇది వియత్నాం లో పెరుగుతుంది. ఈ కోడిని డ్రాగన్ చికెన్ అని కూడా పిలుస్తారు. దీని మాంసం చాల రుచిగా ఉంటుంది. ఈ రకం కోడలు పెరగటానికి చాల సమయం పడుతుంది అందుకనే ఏమో ఈ కోడిలు అంత ఖరీదు. ఇది ఒక్క కోడి పిల్ల సుమారు 1,70,000 వరకు ధరలు పలుకుతాయి.
డెత్ లేయర్ (Deathlayer):
ఈ కోడి జర్మనీ లో పెరుగుతుంది. ఇది మిగిలిన అన్ని రకాల కొడులతో పోలిస్తే ఎక్కువ గుడ్లు పెట్టగలదు. సాధారణ కోడీలని చూస్తే అవి 3 సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల వరకు గుడ్లు పెడతాయి కానీ ఈ డెత్ లేయర్ కోడిలు వాటి జీవితంలో చివరి రోజు వరకు గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఎక్కువ గుడ్లు పెట్టె కారణం చేతనే వీటికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది ఒక కోడి సుమారు 21,500 వరకు ధర పలుకుతుంది.
లైజ్ ఫైటర్(Liege Fighter):
ఈ కోడి చూడటానికి చాల బారి శరీర ఆకృతిని కలిగి ఉంటుంది. దీనికి దూకుడు చాల ఎక్కువ, షాదీ కొడులని ఎక్కువగా కోడి పందేలతో వాడుతారు. ఈ కోడి బెల్జియం దేశం నుండి ఇది చాల శక్తివంతమైన చికెన్ బ్రీడ్. దీని ధర సుమారు 4,500 నుంచి 5,000 వరకు ఉంటుంది. ఇక ఈ జాతి కోడిపిల్లలు ఇంకా ఎక్కువ ధరను పలుకుతాయి, అవి సుమారు 12,500 నుండి 13,000 వరకు ధరలు పలుకుతాయి.
ఒరస్ట్ (Orust):
స్వీడన్ దేశానికీ సంబందించిన ఈ ఒరస్ట్ జాతి కోడి ఇప్పడు అంతరించి పోయే దశ లో ఉంది. వాటి సంఖ్య ఇప్పుడు 4000 మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంత అరుదుగా ఉండడం వలన దీని ఖారుదు సుమారు 8,500 నుంచి 9,000 వరకు పలుకుతుంది.
ఒలాండ్స్క్ డ్వార్ఫ్ (Olandsk Dwarf):
ఈ కోడి స్వీడన్ దేశం లోని ఒలాండ్ అనే దీవులలో దొరుకుతాయి కనుక వీటికి ఆ పేరు వచ్చింది. ఇవి చాల రంగులలో దొరుకుతాయి నలుపు, పచ్చ, బూడిద రంగు ఇలా మొదలైనవి. ఈ కోడలు ఇంత ఎక్కువ ధర పలకడిని మొదటి కారణం ఇవి చాల అరుదైనవి మరియు వీటిని పెంచడం లో ఎటువంటి మానవ పరిణామం ఉండదు. ఇవి సహజంగానే అంత చిన్నగా ఉంటయి. దీని ఒక్క కోడి పిల్ల ధర 8,500 నుండి 9,000 వరకు పలుకుతుంది.
స్వేడిష్ బ్లాక్ (Swedish Black):
ప్రపంచం లో కొన్ని ఖరీదైన కోళ్లను ఉత్పత్తి చేయడం లో స్వీడన్ ముందు ఉంటుంది. అలాంటిది ఈ స్వీడిష్ బ్లాక్ అనే కోడి కూడా స్వీడన్ దేశం లో పుట్టినదే. ఇది కూడా అయం సేమని కోడి లాగానే నల్లగా ఉంటుంది. ఈ కోడులు ఇంత ధర పలకడానికి ముఖ్య కారణం అవి అరుదుగా ఉండడం. వీటి సంఖ్య మనం చూస్తే 500 మాత్రమే ఉన్నాయి. ఇవి ఒక కోడి 8,500 నుంచి 9000 వరకు పలుకుతుంది.
బ్రేస్స్ (Bresse):
అయం సెమని, డాంగ్ టావో తర్వాత ఇదే మూడవ ఖరీదైన కోడి. ఈ కోడి ఫ్రాన్స్ దేశం లోని బ్రేస్సే (Bresse) అనే ప్రాంతంలో పెరుగుతుంది. దీని మాంసం చాల రుచిగా ఉంటుంది. రెస్టారెంట్స్ లో దీని మాంసం తో ఎన్నో రకాల వంటలు చేస్తారు. ఈ రకం కోడులు దొరకడం చాల కష్టం మీకు ఒకవేళ దొరికిన దీని కోడిపిల్ల దొరుకుతుంది అది ఒక్క కోడిపిల్ల 2,500 నుంచి 3000 వరకు ఉంటుంది.
బ్రహ్మ (Brahma):
ఈ బ్రహ్మ చికెన్ అమెరికా దేశాలలో దొరుకుతుంది. దీనిని కింగ్ అఫ్ పౌల్ట్రీ అని పిలుస్తారు. ఇది సుమారు ఒక కోడి 8 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇవి చూడడానికి ఎంతో పతిష్టాంగా దృడంగా ఉంటాయి. ఒకప్పుడు ఈ కోడిలు ఒక జత 12,500 నుండి 13,000 వరకు ఉండింది. ఇప్పుడు ఒక కోడి 2,500 వరకు ఉంటుంది.
కడకనాథ్ (Kadaknath):
కడకనాథ్, ఈ కోడిని కాలి మాసి అని కూడా పిలుస్తారు. ఈ కోడి చూడడానికి నల్లగా ఉంటుంది దీని మాంసం కూడా నలుపు రంగులనే ఉంటుంది. ఇవి భారతదేశం లోని మధ్యప్రదేశ్ రాష్ట్రం లో దొరుకుతాయి. కడకనాథ్ కోడులు 2 నుండి 3 కేజీల వరకు బరువు ఉంటాయి. ఇది అన్ని రకాల క్లైమేట్స్ లో ఉండగలదు. దీని ధర ఒకటి 7000 వరకు ఉంటుంది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వ్యవసాయం, ఫ్యాక్ట్స్ ను సందర్శించండి.