Home » చొట్టనిక్కర భగవతి ఆలయం చరిత్ర

చొట్టనిక్కర భగవతి ఆలయం చరిత్ర

by Nikitha Kavali
0 comments
chottanikkara bhagavathi alayam mystery

మన హిందూ పురాణాలలో అమ్మవార్లను ఎంతో శక్తివంతంగా పరిగణిస్తాము. స్త్రీ దేవతా మూర్తులను సృష్టి కి మూలం అంటూ వాళ్ళను పూజిస్తాము. అలాంటి ఒక శక్తివంతమైన అమ్మవారే  ఈ చొట్టనిక్కర భగవతి అమ్మవారు. ఇక్కడికి వస్తే మనలో ఉన్న ఎంతటి దుష్ట శక్తులు అయినా మనల్ని వదిలి వెళ్లిపోతాయి. ఇక్కడ ఉన్న అమ్మవారు  సరస్వతి దేవి, లక్ష్మి దేవి, భద్రకాళి మాతలను ఏకమై ఉంటుంది. 

ఈ  ఆలయం ఎక్కడ ఉంది

ఈ ఆలయం కేరళ లో ఎర్నాకులం జిల్లా లో కొచి నగరానికి దక్షిణం వైపున ఉన్న చొట్టనిక్కర అనే ఊరిలో ఈ అమ్మవారు కొలువై ఉంటారు. ఈ అమ్మవారిని మేల్కవత్ భగవతి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడానికి మూడు కథలు ఉన్నాయి అని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. వాటిలో 

లక్ష్మి అమ్మవారి కథ:

మొదటిది, లక్ష్మి నారాయణుల కథ. పూర్వ కాలం లో కేరళ లో కర్ణన్ అనే మాంత్రికుడు ఉండేవాడు అతను కాళీమాతకు పూజ చేసేవాడు. అతనికి బంధువులు ఎవరు లేరు ఒక కూతురు ఉంది. అతను కాళీ మాతకు పూజ చేసే విధానం లో ప్రతి శుక్రవారం గోమాతను బలి ఇచ్చేవాడు. అలా ఆవును బలి ఇవ్వడానికి అతను ఎక్కడెక్కడి నుంచో ఆవులను దొంగిలించి తెచ్చేవాడు.

ఒకరోజు అతను ఎంత వెతికిన ఆవు దొరకలేదు. ఒక లేగ దూడ కనిపిస్తే దానిని బలి ఇవ్వడానికి ఇంటికి తెస్తాడు. కానీ అతని కూతురు ఆ లేగ దూడని చూసి దానిని తాను పెంచుకుంటాను అని అడగగా కూతురు అడిగిన కోరికని కాదనలేక ఆ రోజు దూడను బలి ఇవ్వకుండా కూతురికి ఇచ్చేస్తాడు. ఆ కూతురు ఆ దూడను చాల ప్రేమగా చూసుకునేది. 

ఒకరోజు కర్ణన్ వేటకు వెళ్లగా. ఇంట్లో ఉన్న కూతురిని పాము కరిచి చనిపోతుంది. కర్ణన్ వచ్చి అలా చనిపోయి పడి ఉన్న కూతురిని చూసి రోధిస్తాడు. అప్పుడు ఆ దారిలో వెళ్తున్న సన్యాసి “నువ్వు చేసిన పాపాల వల్లనే నీ కూతురు చనిపోయింది నువ్వు ఆవులను లేగ దూడలనుండి దూరం చేసావు అందుకే నీకు ఇలా జరిగింది”  మనస్ఫూర్తిగా నువ్వు  అమ్మవారిని క్షమించమని కోరుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఇక అతను చేసేది ఏమి లేక కూతురికి దహన సంస్కారాలు చేయడానికి  కట్టెల కోసం అడవికి వెళ్తాడు. తిరిగి వచ్చే లోపు అతని  కూతురు శవం అక్కడ మాయమైపోయి ఉంటుంది. ఇక అంతలో అతని కూతురు ప్రేమగా చూసుకుంటున్న ఆవు దూడ కూడా అతని కళ్ళ ముందే మాయమైపోయి ఒక రాయి లా మారుతుంది, దాని పక్కనే ఇంకో రాయి కూడా ప్రత్యేక్షమవుతుంది.

అతనికి ఏమి అర్ధం కాకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గాలిలో ఒక శబ్దం “వీళ్ళు లక్ష్మి నారాయణుల ప్రతిరూపులు వీళ్ళు ఇక్కడ ఉన్న దుష్ట శక్తులను అంతం చేస్తారు. వీళ్ళు ఇక్కడ దూడ రూపం లో నీ ఇంటికి వచ్చి నీ కూతురితో సఫారీలు చేయించుకుని నీ కూతురికి మోక్షాన్ని ప్రసాదించారు. నువ్వు వీళ్ళకి పూజ చేసి నీ పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందు” అని వినిస్పిస్తుంది.

ఇక అలా కర్ణన్ అక్కడ ఆ విగ్రహాలకు రోజు పజలు చేస్తూ ఉంటాడు. అలా కొంత కాలానికి కర్ణన్ మరణిస్తాడు. ఇక అక్కడ దేవతలకు పూజలు చేయడానికి ఎవరు లేరు మళ్ళి ఆ ప్రదేశానికి యక్షి, భూత పిశాచాలు వస్తాయి.

ఒకరోజు ఆ గ్రామం లోని ఒక యువతీ అడవికి గడ్డి ని కోయడానికి వచ్చి తన దగ్గర ఉన్న కత్తిని అక్కడ ఉన్న ఒక రాయి కి వేసి సాన పెడుతుంది. అలా సాన పెట్టినప్పుడు ఆ రాయి నుండి రక్తం రావడం జరిగింది. వెంటనే ఊర్లో వాళ్ళందరూ అక్కడ ఏదో దుష్ట శక్తీ ఉంది అని అక్కడికి వచ్చారు.

కానీ అక్కడ ఉన్నఆ ప్రశాంతమైన వాతావరణం చూసి ఇది దుష్ట శక్తులు ఉండే ప్రదేశం కాదు ఇది దైవ శక్తీ అయి ఉంటుంది అని అనుకుని అక్కడి ఉన్న లక్ష్మి నారాయణుల రాళ్లకు పూజలు చేయడం తిరిగి ప్రారంభిస్తారు.

సరస్వతి అమ్మవారి కథ:

మనం మొదట ఇక్కడ ఉన్న అమ్మవారి లో లక్ష్మి దేవి, సరస్వతి దేవి, భద్ర కాళీ అమ్మవార్లు ఉంటారని చెప్పుకున్నాం కదా. మరి మొదటి కథలో లక్ష్మి అమ్మవారు వెలిశారు. మరి సరస్వతి దేవి ఈ రాయి లోకి ఎలా వచ్చారో ఈ రెండవ కథ ద్వారా తెలుసుకుందాం.

కేరళలోని దేవాలయాలన్నిటిని ఆది శంకరాచార్యులు సంచరిస్తున్నప్పుడు అతనికి అక్కడ మనుషులు నిరక్షరాస్యతో అనాగరికంగా కనిపిస్తారు. అలా ఉండడం సంకరాచార్యులకి నచ్చలేదు. ఇక అతను కాశ్మీర్ వెళ్లి అక్కడ సరస్వతి అమ్మవారికి తపస్సు చేస్తాడు.

సరస్వతి అమ్మవారు అతనికి ప్రత్యేక్షం అయి ఏం వరం కావాలో అని అడుగుతుంది. అప్పుడు ఆది శంకరాచార్యులు కేరళలోని ప్రజలు నిరక్షరాస్యంగా అనాగరికంగా ఉన్నారు నువ్వు అక్కడికి వచ్చి కొలువయి ఆ ప్రజలను కాపాడు తల్లి అని అడుగుతాడు.

అప్పుడు సరస్వతి మాత నేను నీతో కేరళ వస్తాను కానీ నువ్వు దారి మధ్యలో వెనకకి తిరిగి చూస్తే నేను అక్కడే శిలా అయిపోతాను అని షరతు పెడుతుంది. దానికి ఆది శంకరాచార్యులు ఒప్పుకుంటారు. ఇక సరస్వతి అమ్మవారు శంకరాచార్యుల వెనకాల నడుస్తూ ఉంటుంది.

కానీ కర్ణాటక లోని ప్రస్తతం కొల్లూరు గా పిలుస్తున్న ఆ ప్రాంతానికి వచ్చేసరికి అతనికి అమ్మవారి గజ్జెల సవ్వడి వినిపించదు. దానితో అతను వెనక్కు తిరిగి చూస్తాడు అంతే ఇక అక్కడే సరస్వతి దేవి శిలా అయిపోతుంది. 

దానితో శంకరాచార్యులు అక్కడికక్కడే ఆత్మర్పణ చేసుకోవడానికి పూనుకోగా అమ్మవారు ఆపి ఇది నీ నిర్ణయం కాదు భగవంతుని నిర్ణయం నేను ఇక్కడ మౌకాంబిక దేవిగా వెలిసి ఉంటాను అని చెప్పి అతని ఆత్మర్పణం ని ఆపేస్తుంది.

అప్పుడు శంకరాచార్యులు అమ్మ నేను నిన్ను కేరళలో వెలిసి ఉండమని కోరాను కానీ నువ్వు ఇక్కడ కొలువయ్యావు అక్కడ ప్రజలు ఏం అయిపోతారు అమ్మ అని అడగగా.

సరస్వతి దేవి అప్పుడు “నేను పొద్దున నుండి మధ్యాహ్నం వరకు కేరళలో వెలిసి ఉంటాను; మధ్యాహ్నం నుండి ఇక్కడ దర్శనం ఇస్తాను అని చెప్తారు. ఇక దానికి శంకరాచార్యులు సరే అని అంటదు. ఈ విధంగా సరస్వతి అమ్మవారు ఆ లక్ష్మి అమ్మవారు ఉన్న రాయిలో కలిసిపోతుంది. 

కాళికా దేవి కథ:

ఇక శంకరాచార్యులు  ఇక్కడ లక్ష్మి అమ్మవారు ఉన్నారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు కాళీ దేవి కూడా ఉంటె బాగుంటుంది అని కాళీ మాతకు తపస్సు చేయగా కాళీ అమ్మవారు కూడా ఈ మూర్తిలో కలిసిపోయారు. అందువలన ఇక్కడ తెల్లవారుజామున తెల్లని వస్త్రాలతో సరస్వతి దేవి లాగా, మధ్యాహ్నం కాషాయ వస్త్రం లో లక్ష్మి దేవి లా, సాయంత్రం నీలి రంగు వస్త్రాలలో భద్ర కాళీ లా దర్శనమిస్తారు.

కిల్కావు అమ్మవారి కథ:

ఈ  గుడిలో కింద భాగాన  కిల్కావు అమ్మవారు ఉంటారు, ఈ అమ్మవారు భద్రకాళి రూపం. దుష్ట శక్తులను ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరే విడిపిస్తారు. ఇక్కడ ఈ కిల్కావు అమ్మవారు వెలిసిన దానికి ఒక కథ ఉంది.

ఈ ప్రదేశం లోని అరణ్యానికి దగ్గర్లో మంత్ర శాస్త్రాన్ని బోధించే ఒక గురువు ఉన్నారు. అతను ఒక రోజు అమ్మవారికి సంబందించిన మంత్రాలను ఒక దాంట్లో పెట్టి తన దగ్గర విద్యను అధ్యయనం చేస్తున్న ఒక శిష్యుడికి ఇచ్చి తన మిత్రుడికి దీనిని అందచేయమని చెపుతడు.

ఇక అప్పుడు అతను ఒక తెల్లని వస్త్రం లో గురువు ఇచ్చిన దానిని పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. రాత్రి అయిపోతుంది. దారిలో అతనికి ఓక అమ్మాయి ఎదురువచ్చి నేను ఒక్కటే ఉన్నాను రాత్రి అయిపొయింది చీకటి గా ఉంది నేను మీతో వస్తాను అని అడుగుతుంది. దానికి అతను సరే అని అంటాడు.

ఆమె దారిలో అతనితో కొంచెం సన్నిహితంగా ఉంటుంది. కానీ అతడు నిగ్రహంగా ఉంటాడు. ఇక అతని గురువు గారు చెప్పిన ఇల్లు వచ్చేస్తుంది. ఇక అతను ఇంటి లోపలి వెళ్లి ఆ మంత్రాలు ఉన్న తాళపత్రాలను అతని గురువుగారి మిత్రుడికి ఇచ్చేస్తాడు.

ఆ పెద్దయన నువ్వు ఒక్కడివే వచ్చావా నాయన అడిగితే లేదు అండి నేను వచ్చే దారిలో ఒక అమ్మాయి నాతో వస్తాను అంటే వచ్చింది అని చెప్పి బయట ఉన్న ఆ అమ్మాయిని చూపిస్తాడు. అప్పుడు ఆ పెద్దయన ఒకసారి నన్ను పట్టుకొని ఆ అమ్మాయిని చూడు అని చెప్పగా అతనికి ఆ అమ్మాయి యక్షి లా కనిపిస్తుంది. అది చూసి ఆ శిష్యుడు భయం తో హడలిపోతాడు.

అతను ఆ పెద్దయనను ఇలా అడుగుతాడు “మరి వచ్చే దారిలో నన్ను ఏమి చేయలేదు అని అడగగా” ఆ పెద్దయన నీ దగ్గర అమ్మవారి మంత్రాలు తలపాత్రలు ఉన్నాయి అందుకే అది నిన్ను ఏమి చేయలేదు అని చెప్తాడు.

మరి నేను ఇప్పుడు ఎలా వెళ్లాలి అని ఆ పెద్దయనను అడగగ అతను ఒక మంత్రించిన వస్త్రం అతనికి ఇస్తాడు. ఇది తీసుకొని నీకు ఎంత త్వరగా వీలు అయితె అంత త్వరగా ఇక్కడ నుంచి పక్కనే ఉన్న చోట్టనిక్కర అమ్మవారి ఆలయం కు వేళ్ళు అని చెప్తాడు.

ఇక అతను ఆ యక్షి స్త్రీ ని వెంటబెట్టుకొని బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళాక ఆ యక్షి స్త్రీ అతనితో  తన చేతిలో ఉన్న ఆ వస్త్రాన్ని పడేయి మనం ఇక్కడే కొంచెం సేపు ఏకాంతం గా ఉందాము అంటుంది. దానికి అతనికి భయం వేసి ఆ పెద్దయన ఇచ్చిన మంత్రించిన అక్షింతలను ఆ స్త్రీ మీద విసురుతాడు.

ఇక ఆ స్త్రీ తన యక్షి రూపాన్ని దాలుస్తుంది. ఇక తెలిసిపోయింది అని ఆ యక్షి అతనిని పరిగెత్తించి వెంటాడుతూ ఉంది. అతను పరిగెత్తి పరిగెత్తి చొట్టనిక్కర అమ్మవారి ఆలయానికి చేరుకుంటాడు.

కానీ అంతలోనే అతని కాళ్ళను యక్షి పట్టుకొని ఉంటుంది. అదృష్టం కొద్దీ అతను ఆ అమ్మవారి ఆలయ గడపను తన చేతులతో పట్టుకొని ఉంటాడు. ఇక అప్పుడు అమ్మవారు భద్రకాళి రూపం దాల్చి యక్షి ని చంపేసి ఆ రక్తాన్ని పక్కనే ఉన్న మడుగులో కడుగుతుంది. దానినే ఇప్పుడు రక్థకులం లేదా యక్షికులం అని పిలుస్తారు.

ఇది అండి చొట్టనిక్కర అమ్మవారి విశిష్టత. ఇంకా మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి, చరిత్ర ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.