ఆ ఆ ఆ
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ
సగమగ సనిదని మద నిస నిస గస గా
పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరి చేల సంపదలు
అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా
సగమగ రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా
వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు
ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ రాముని సుమ శరమా ఆ రాముని సుమ శరమా
కదిలే వెన్నెల శిల్పమా
కలలే కలగను రూపమా
అనుమతి నడగక యెడ సడిలో
అలజడి రేపిన అపురూపమైన భావమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా
చిత్రం: నీ స్నేహం
దర్శకుడు: పరుచూరి మురళి
సంగీతం: R.P. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
నటులు: ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.