కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటే..
ఏవె ఏవెవరి నిన్నటి కలలు లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే..
ఏంటి ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలేనులే
వస్తున్నా వస్తున్నా… నీకోసం వస్తున్నా
సుడిగాలి వేగంతో… నీ వైపే వస్తున్నా
ఏ దారి మూస్తున్నా… ఏ దాడి చేస్తున్నా
ప్రాణాలే తీస్తున్నా… నిన్నొదులుకోను హామీ ఇస్తున్నా….
చిలక.. ఓ .. రామ చిలక..
చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా..
చిలక.. ఓ .. రామ చిలక..
ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా..
నా ఆశలకే ఆయువిమ్మని
నా ఊహలకే ఊపిరిమ్మని
నా చీకటికే వెలుగు ఇమ్మని ఎవరినడగడం
నీ కంటపడె వీలు లేదని
నీ వెంట వచ్చే దారి లేదని
నా జీవితమె జారుతోందని ఎలా తెలుపడం
ఒక్క పూట ఉండలేకపోయా నువ్వు లేక
వందేళ్ళెట్టా గడపాలిక
కన్న కలలే కట్టుకధలాగా మార్చినాది
కాలానికే దయ లేదుగా
చిలక.. ఓ .. రామ చిలక..
చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా..
చిలక.. ఓ .. రామ చిలక..
ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా..
ఆ వెన్నెలనే అడిగి చూసా
ఈ వేకువనే అడిగి చూసా
నీ జాడనే చూసి చెబుతాయేమో అనీ
ఈ గాలితో కబురు పంపా
మేఘాలతో కబురు పంపా
నా వేదనే నీకు వివరించాలి అనీ
ఈ కాలంపైన కత్తి దుయ్యాలనుంది
నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు
నా దేహంపైన మట్టి పొయ్యాలనుంది
నాకు నీతో రాసి పెట్టనందుకూ…
చిలక.. ఓ .. రామ చిలక.. ఆఆ ఆ
ఓ ఓ రామ చిలుక ఆ ఆ ఆ
కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటే
ఏవె ఏవెవరి నిన్నటి కలలు లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే
ఏంటి ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలేనులే
వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా
వెళ్ళాలని లేకున్నా భారంగా వెళ్తున్నా
నువ్వెంతా రమ్మన్నా రాలేను అంటున్నా
నేనంటూ ఏమైనా నువ్వు క్షేమంగుంటె చాలనుకుంటున్నా..
చిలక.. ఓ .. రామ చిలక..
నా మనసే నీకు ఎపుడో ఇచ్చాను గనకా
చిలక.. ఓ .. రామ చిలక..
జత రావొద్దంటే అలుపే ఒంటరి నడకా
_____________
Song Credits:
సాంగ్ : చిలక ఓ రామ చిలక (Chilaka Rama Chilaka)
దర్శకత్వం – ఎడిటింగ్ – డోప్ – డి – వినయ్ షన్ముఖ్ (Vinay Shanmukh)
నిర్మాత – దీప్తి సునైనా (Deepthi Sunaina)
నటీనటులు – అంకిత్ కొయ్య (Ankith koyya) & దీప్తి సునైనా (Deepthi Sunaina)
సంగీత స్వరకర్త: విజయ్ బుల్గానిన్ (Vijai bulganin)
గీత రచయిత: సురేష్ బనిశెట్టి (suresh banisetti)
గాయకులు: విజయ బుల్గానిన్ (vijai bulganin) & లక్ష్మి మేఘన (lakshmi meghana )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.