నీ ముక్కు పోగు మెరుపొలోన
పొద్దు పొడిసే తూరుప్పోలన
మైసమ్మ
యర్రా ఎర్రని సూరీడే
నీ నుదుటన బొట్టయ్యే
ఓ సళ్ళని సూపుల తల్లి
మాయమ్మా
అమ్మలగన్న అమ్మారన్న
పచ్చి పసుపు బొమ్మరన్న
యాప చెట్టు కొమ్మరన్న
ధూపామేసే దుమ్మురన్న
ఆషాడ మసమన్న
అందులో ఆదివారమన్న
కొత్త కుండల బోనమన్న
నెత్తి కెత్తెను పట్నమన్న
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
హే రాయే రాయే
హే రాయే రాయే
అరేయ్ రాయే రాయే
అరేయ్ రాయే రాయే
మైసమ్మ
బల్కంపేట ఎల్లమ్మవే
మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయిని మంకాలివే మా యమ్మ
ఊరూరా పోచమ్మవే
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
అరేయ్ రేవుల పుట్టిందమ్మ
రేణుక ఎల్లమ్మ
జేరిపోతులా తీసి జడల చుట్టింది
నాగు పాములా తీసి నడుమున కట్టింది
ఏడుగురు అక్క చెల్లెల్లు యెంట రాంగా
ఏడేడు లోకాలు ఏలుతున్నదమ్మ
మావురాల ఎల్లమ్మ
దండాలు తల్లి
థిస్ ఇస్ బార్క్ బార్క్ బర్కత్ పురా
డీజే ఇస్మార్ట్ డిస్ డిస్ డిస్కో బోనాల్
పెయ్యి నిండా గవ్వల్ని పర్సుక్కున్నవే
వెయ్యి కండ్ల తల్లి
నీకు యాట పొత్తులేయ్
నిమ్మకాయ దండల్లో
నిండుగున్నవే
కళ్ళు కుండా తెచ్చి
ఇంత సక్కా పోస్తమే
అరేయ్ చింత పూల
చీర కట్టినవే
చేత శూలం
కత్తి పట్టినవే
మొత్తం దునియానే
ఏలుతున్నవే
హే రాయే రాయే తల్లి
హే రాయే రాయే
అరేయ్ రాయే రాయే
అరేయ్ రాయే రాయే
మైసమ్మ
జూబిలీ హిల్స్ పెద్దమ్మవే మాయమ్మా
జగమేలే మా తల్లివే
గోల్కొండ ఎల్లమ్మవే మాయమ్మా
లష్కర్ కె నువ్ రాణివే
యో సే యో సే
హే పోత రాజురో
అరేయ్ జజ్జనకర
జజ్జనకర తీన్ మారురో
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
ఏస్కో మామ తీన్ మార్
అగ్గి గుండాలలో నువ్వు బగ్గుమన్నవే
జుట్టు ముట్టు సుక్కల్లో ముద్దుగున్నవే
పుట్టలోన ఉన్నట్టు మట్టి రూపమే
బాయిలోన పుట్టి అల్లినవు బంధమే
హే గాలి ధూళి అంత నువ్వేలెయ్
జాలి గళ్ళ తల్లి నువ్వేలెయ్
ఈ జనమంతా నీ బిడ్డలెయ్
హే రాయే రాయే
హే రాయే రాయే
అరేయ్ రాయే రాయే
అరేయ్ రాయే రాయే
మైసమ్మ
బెజవాడ దుర్గమ్మవే మా తల్లి
కలకత్తా మహాంకాలివే
కాంచీలున్న కామాక్షివే మాయమ్మా
మధురోలోన మీనాక్షివే
యో సే యో సే
అరేయ్ ఈరగోళ రో
అరేయ్ తొట్టెళ్లతో పొట్టేళ్ల
బండి కదిలేరో
యో సే యో సే
నీ బోనాలు రేయ్
చల్లో చల్లో
గండి మైసమ్మరో
థిస్ ఇస్ హమారా కిరాక్ బోనాల్ బోనాల్ బోనాల్
మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.