హాయ్ తెలుగు రీడర్స్ ! మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తెలుగు సినిమా భజే వాయు వేగం OTT లోకి వచ్చేస్తుందండోయ్. కార్తికేయ హీరోగా తెరెకెక్కిన సినిమా ‘భజే వాయు వేగం’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం OTT ఆడియన్స్ కి వినోదం పంచడానికి సిద్ధంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జూన్ 28(2024) నుండి ప్రసారం కానుంది.
డైరెక్టర్: ప్రశాంత్ రెడ్డి (కొత్త పరిచయం)
తారాగణం: కార్తికేయ, ఐశ్వర్య మేనన్, రాహుల్ టైసన్, తనికెళ్ళ భరణి, శరత్ లోహితస్య తదితరులు
సినిమా కథ ఏంటి …
వెంకట్(కార్తికేయ) అనే పిల్లాడి తల్లితండ్రులు వ్యసాయంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో అనాధ అయిన వెంకట్ ని తన తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య(తనికెళ్ళ భరణి) చేరదీసి, తన కొడుకు రాజు(రాహుల్ టైసన్) తో పాటు పెంచి పెద్ద చేస్తాడు. వీరు పెద్దవారు అయిన తరువాత క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం తో వెంకట్, అలాగే మంచి ఉద్యోగం కోసం రాజు, ఇద్దరూ కూడ వూరి నుండి హైదరాబాద్ కి వస్తారు. కానీ కొందరు చేసిన కుట్రలు వల్ల వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతారు. దీంతో వెంకట్ క్రికెట్ బెట్టింగులు వేస్తూ.. రాజు ఒక స్టార్ హాటల్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు.
కొంతకాలం అనంతరం లక్ష్మయ్య అనారోగ్యానికి గురవుతాడు. ఆయన్ను కాపాడాలంటే ఆపేరేషన్ చేయాలని.. అందుకు ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని వైదులు చెప్తారు. దీంతో ఆ డబ్బు సంపాదించడానికి వెంకట్, డేవిడ్(రవిశంకర్) గ్యాంగ్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ వేస్తాడు. ఆ బెట్టింగ్లో వెంకట్ గెలిచినా.. తాను గెలుచుకున్న అమౌంట్ నలభై లక్షలు ఇవ్వడానికి డేవిడ్ మనుషులు నిరాకరిస్తారు…ఆ తరువాత ఏమైంది? డేవిడ్ గ్యాంగ్ నుంచి వెంకట్ కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన తండ్రి, తన స్నేహితుడిని కాపాడుకోవడానికి అతనేంచేసాడు? అనేది ఈ చిత్ర కథ…
మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు రీడర్స్ OTT ని సందర్శించండి.