లోకాలనేలే మా రాజు
దివినోదించి వచ్చాడు
సిద్ధమా సంబరం
బేత్లెహేము ఊరిలోన
పశువుల శాలలోన
శ్రీ యేసు జన్మించాడు
రక్షణ భాగ్యం తెచ్చాడు || 2 ||
మనసారా ఆరాధిస్తూ పాటలు పడేదం
రారాజు పుట్టాడు అని సందడి చేసేద్దాం || 2||
దివినేలే రారాజు భువి లోన పుట్టాడు లోకానికే సంబరం
గతిలేని మనకొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యమో || 2||
చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్నాయేలుగా ఇశ్రాయేలు దేవునిగా || 2 ||
అనుదినము బలపరచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు || 2 ||
ఆదరిస్తాడు ఆదరిస్తాడు
దివినేలే రారాజు భువి లోన పుట్టాడు లోకానికే సంబరం
గతిలేని మనకొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యమో || 2||
వ్యాధి అయినా బాధ అయినా శోధన మరి ఏదైనా
కన్నీటి లోయలో కృంగిన వేళలో ||2||
స్వస్థపరచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతి నిస్తాడు ||2||
దివినేలే రారాజు భువి లోన పుట్టాడు లోకానికే సంబరం
గతిలేని మనకొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యమో || 2||
పాపులను రక్షించ ప్రభు యేసు జన్మించె
శాపమును తొలిగింప నరునిగా అరుదెంచే ||2||
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే ||2||
దివినేలే రారాజు భువి లోన పుట్టాడు లోకానికే సంబరం
గతిలేని మనకొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యమో || 2||
బేత్లెహేము ఊరిలోన
పశువుల శాలలోన
శ్రీ యేసు జన్మించాడు
రక్షణ భాగ్యం తెచ్చాడు || 2 ||
మనసారా ఆరాధిస్తూ పాటలు పడేదం
రారాజు పుట్టాడు అని సందడి చేసేద్దాం || 2||
దివినేలే రారాజు భువి లోన పుట్టాడు లోకానికే సంబరం
గతిలేని మనకొరకు స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యమో || 2||
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.