బావో బంగారం నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
బావో బంగారం నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
బావో ఓ బావో
నా బావో బంగారం
నీ నవ్వే సింగారం
గల్లా ఎగిరేసి నడిచొస్తుంటే
గల్లి గల్లి నిన్ను చూడన వట్టే
ఆడ గుంపు అంత నీ చుట్టూ చేరి
మందలించి మాట కలపన వట్టే
అది చూసి నా మనసు
అయ్యో అంటూ గుండె బాదుకొనే వట్టే
బావో ఓ బావో
నా బావో బంగారం
నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
బావో బంగారం
నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
గుడు గుడు మోటారు సప్పుడు ఇంటే
గదిలో ఉన్న నాకు గుబులే పుట్టే
గట్ల వచ్చే నిన్ను చూడాలంటే
గతులేసి కాళ్ళు పరుగే పెట్టే
నీకు ఎదురుంగా వస్తూవుంటే
పాడు పోరగాళ్ళు ఈలే గొట్టే
బావో ఓ బావో
నా బావో బంగారం
నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
బావో బంగారం
నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
కుస్తీ పట్టా నువ్వు పోటీ చేస్తే
అందరు నిన్ను చులకన చూస్తే
తొడగొట్టి నువ్వు తలబడుతుంటే
పడగొట్టగా ఎగబడుతుంటే
గట్లనే నిన్ను చూస్తూ ఉంటే
పానమంతా గాయి గాయిగా పట్టే
బావో ఓ బావో
నా బావో బంగారం
నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
బావో బంగారం
నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
జోడు కోసం ఈడు అడగనే వట్టే
గోడు చెప్పుకుంట గునకన వట్టే
వేళకు కూడు పోననా వట్టే
కంటికి కునుకే రాననా వట్టే
ఎప్పుడయ్యా నాకు నీతో మనువు
ఎప్పుడిస్తావో పెళ్ళాం కొలువు
బావో ఓ బావో
నా బావో బంగారం
నీ నవ్వే సింగారం
తిప్పుతుంటే నువ్వు మీసం
అయిపోయా దాసోహం
_________
Song Credits:
సాంగ్: బావో బంగారం (Bavo Bangaram)
నటీనటులు : పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar), రౌడీ హరీష్ (Rowdy Harish)
గాయని: మమతా రమేష్ (Mamatha Ramesh)
లిరిక్స్: హేమ రెడ్డి (Hema Reddy)
సంగీతం: Dj శేఖర్ ఇచ్చోడ (Dj Shekar Ichoda)
కొరియోగ్రఫీ: శేఖర్ వైరస్ (Shekar Virus)
ఎడిటింగ్, దర్శకత్వం: రంగు అజయ్ (Rangu Ajay)
నిర్మాత: అవంతిక (Avanthika)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.