ఎప్పటికి తన గుప్పెట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణం ముండదు
చిక్కులలో పడటం తనకేం సరదా
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రముల మది మారితే ఎలా
నిన్న మొన్నా నీ లోపల కలిగిందా ఏనాడయినా కల్లోలం ఇలా
ఈ రోజెమైందని ఏదైనా అయ్యిందని
నికైనా కాస్తయినా అనిపించిందా
ఎప్పటికి తన గుప్పెట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణం ముండదు
చిక్కులలో పడటం తనకేం సరదా
ఏదోలా చూస్తరే నిన్నో వింతల
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా
మునుపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రముల మది మారితే ఎలా
నీ తీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్లుతుందా కొత్త తీరానికి
మార్పేదయినా వస్తుంటే నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా
వెళ్లే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా
చిత్రం:మిస్టర్ పర్ఫెక్ట్ (Mr Perfect)
పాట పేరు:బదులు తోచని (Badhulu Thochani)
తారాగణం:ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు:కార్తీక్ (Karthik), మల్లికార్జున్ (Mallikarjun)
సాహిత్యం:సిరివెన్నెల సీతారాం శాస్త్రి (Sirivennela Sitaram Sastry)
సంగీత దర్శకుడు:దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం:దశరధ్ (Dasaradh)
అగ్గి పుల్ల లాంటి ఆడ పిల్ల సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి