Home » అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా – ఒక్కడు

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా – ఒక్కడు

by Firdous SK
0 comments
attarintiki ninnettukupotaanugaa song lyrics okkadu

పాట: అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా
సినిమా: ఒక్కడు
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: శ్రేయా ఘోషల్, హరిహరన్


ముత్తైదులంతా మృదమారా ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించుకోండి
శ్రీరామ రక్షణ అనే క్షీరాబ్ధి కన్యకి
ముమ్మారు దిష్టి తీసి దీవించరే

మనసు పడే మొగుడొస్తాడని
మేనంతా మెరిసింది
మెడిసి పడే మదిలో సందడి
మేళాలై మ్రోగింది

నీకు నాకు ముందే రాసుంది జోడి

హరిలో రంగా హరి
వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి
బహు బాగుంది బాజా భజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరల దోచుకుపో యమ దర్జాగా

గెలిచానే నీ హృదయం
కలకాలం ఈ విజయం
నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం
నీ పాపిట సింధూరంగా నిలపనా

కలలన్నీ ఈ నిమిషం
నిజమయ్యే సంతోషం
నాలో దాచగలనా
దరిచేరే నీ కోసం
చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా

ముస్తాబు చెయ్యరటే
ఈ ముద్దుల గుమ్మకీ
సిగ్గుపడు చెంపకి
సిరి చుక్క దిద్దరే

పట్టు చీర కట్టరటే
ఈ పుత్తడి బొమ్మకి
తడబడు కాళ్ళకి
పారాణి పెట్టరే

వగలన్నీ నిగనిగలాడగా
నాన్నల్లే కౌగిల్లో
నగలన్నీ వెలవెల బోవా
చేరందే నీ వొళ్ళో

నాకే సొంతం కానీ
నీ సొమ్ములన్నీ

హరిలో రంగా హరి
వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి
బహు బాగుంది బాజా భజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరల దోచుకుపో యమ దర్జాగా

ఒట్టేసి చెపుతున్నా
కడదాకా నడిపించే
తోడై నేనున్నా
ఏడడుగుల పయననా
ఏడేడు లోకాలైనా దాటనా

వధువై ఎదురొస్తున్నా
వరమాలై ఎదపైన
వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా
చదివిస్తా వరకట్నంగా సరేనా

ముక్కోటి దేవతలు
మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో
ఈ కొంగుముడి

ముత్యాల జల్లాగా
అక్షింతలు వెయ్యాలి
ముచ్చట తీరేలా
అంతా రండి

ఏనాడు ఎవరు చేరని
ఏకాంతం వెతకాలి
ఏ కన్ను ఎపుడు చూడని
లోకంలో బతకాలి

పగలు రేయి లేని
జగమేలుకొని

హరిలో రంగా హరి
వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి
బహు బాగుంది బాజా భజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరల దోచుకుపో యమ దర్జాగా

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరల దోచుకుపో యమ దర్జాగా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.