Home » అరెరే పసి మనసా సాంగ్ లిరిక్స్: కృష్ణం వందే జగద్గురుమ్

అరెరే పసి మనసా సాంగ్ లిరిక్స్: కృష్ణం వందే జగద్గురుమ్

by Nikitha Kavali
0 comments
arere pasi manasa song lyrics

అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా
మరుపే మొదటి దశ అటుపై దాని దిశ
తెలపదు చిలిపి తమాషా
తననొదిలి ఎటువైపు కను కదలని చూపు
నిను మరచిన తలపు వినదిక నీ పిలుపు
ఊహ విహారమా సాగే సరాగమా
సరదా తగదు సుమ సుతారమా

పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే
అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా
మరుపే మొదటి దశ అటుపై దాని దిశ
తెలుపదు చిలిపి తమాషా

అవునా ఇతనేనా ఇన్నాళ్ళు ఎదురున్నది కదా మరి
అయినా ఇంతకుముందు ఏనాడు పరిచయమైనా లేనట్టుంది
ఎపుడు ఇలాంటి ఓ మలుపు ఈ ప్రయాణంలో కనిపించిందా
వయసుకు ఇదే మేలుకొలుపు ఈ ముహుర్తంలో అనిపించిందా
కదిలే ఒకో క్షణం నడిపే మనోరధం
తెలిపే కథా క్రమం ఏం చెబుతాం

పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
వద్దొద్దంటునే పరాకుల్లో పడుతున్నా
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే

అబలా ఏమైపొతున్నవే సుడిగాలిలో చిగురాకులా
నువ్వలా ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెపుడో
నీలో ఇదే కధ మొదలు ఈ నిషాలయలు గమనించా వా
లోలో అదోలాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టవా
ఏదో అయోమయం అయినా మహా ప్రియం
దాన్నే కదా మనం ప్రేమంటాం

చిత్రం: కృష్ణం వందే జగద్గురుమ్
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
సంగీతం: మణిశర్మ
గాయకులూ: నరేంద్ర, శ్రావణ భార్గవి
నటులు: రానా, నయనతార, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ తదితరులు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.