ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించింది ఈ కాలం
నేను నీతో కలిసున్నా
నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లె వర్షించేలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనే
నా మనసే నీ చెవిలో వినిపించేలే
ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించింది ఈ కాలం
రోజాలే పూస్తున్నవో
ఇలా రమ్యంగా చూస్తున్నవో
నేనిట్టా నీతో ఉంటే
చూపులిలా చిత్తరువైపోతున్నావో
కాలంకే ఏమయ్యిందో
నవ వసంతం పోనాన్నదో
నీ చూపే నన్నే తాకి
గుండెల్లో ప్రేమలే పూస్తున్నదో
దారం లేని గాలి పటమై
హృదయం నేడే ఎగిరెనే
నువ్వే లేని వేళల్లోన
ఊహల్లోన తేలానే
ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించింది ఈ కాలం
నేను నీతో కలిసున్నా
నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లె వర్షించేలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనే
నా మనసే నీ చెవిలో వినిపించేలే
ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించింది ఈ కాలం
___________
Song Credits:
చిత్రం: లవర్స్ డే (Lovers Day)
పాట: ఆనందాలే కన్నుల్లోన (Anandaley Kannullona)
లిరిక్స్ : చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
గాయకుడు: రేవంత్ (Revanth)
సంగీతం: షాన్ రెహమాన్ (Shaan Rahman)
నటీనటులు: ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier), రోషన్ అబ్దుల్ రహూఫ్ (Roshan Abdul Rahoof) మరియు నూరిన్ షెరీఫ్ (Noorin Shereef)
దర్శకుడు: ఒమర్ లులు (Omar Lulu)
సంగీత దర్శకుడు: షాన్ రెహమాన్ (Shaan Rahman)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.