Home » అమ్మమ్మ చెప్పిన కథ

అమ్మమ్మ చెప్పిన కథ

by Haseena SK
1.2K views

ఉసిరికాయ్ అంత ఊరిలో మునక్కాయ అంత ముసలమ్మ కి బంగాళాదుంప అంత బంగారం ఉంది. బంగాళాదుంప అంత బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో పెట్టి తాటికాయ అంత తాళం వేస్తుంది. అది దొండకాయ అంత దొంగోడు చూసి తాటికాయ అంత తాళం పగులకొట్టి బంగాళాదుంప అంత బంగారాన్ని ఎత్తుక పోతాడు అప్పుడు మునక్కాయ అంత ముసలమ్మ పొట్లకాయ్ అంత పోలీస్ కి కాకరకాయ్ అంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయ్ అంత పోలీస్ జీడికాయ్ అంత జీప్ వేసుకుని లవంగం అంత లాఠీ తీసుకుని దొండకాయ అంత దొంగోడ్ని జామకామ్ అంత జైల్లో వేసి మునక్కాయ అంత ముసలమ్మకి బంగాళాదుంప అంత బంగారాన్ని ఇచ్చేస్తాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.