హాయ్ తెలుగు రీడర్స్ ! మీరో లేక మీకు తెలిసిన వారు ఎవరైనా ఒక హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంటున్నారా ? దాని కోసం ఎలా ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ ఎంచుకోవాలి ? అని అనుకుంటున్నారా ! అయితే గుర్తుంచుకోండి కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్స్ ని మనం ఫాలో అయితే మనకు నప్పిన హ్యాండ్ బ్యాగ్ ను ఈజీగా ఎంచుకోవచ్చు.
ఒకప్పుడు హ్యాండ్ బ్యాగ్ అలంకారమే కావచ్చు. కానీ, ఇది ఇప్పుడు అవసరంగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని రోజువారి సౌకర్యాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో యువత నుండి ఓల్డ్ ఏజ్ వారితో పాటు అందరు దీనికి బాగా అలవాటు పడ్డారని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాల అవసరం.
హ్యాండ్ బ్యాగు కొనేముందు దాన్ని ఏ అవసరానికి మనము కొంటున్నాము అనే ముఖ్యమైన స్పష్టత మనకు ఉండాలి. అలాగే అందులో పెట్టే వస్తువులు బట్టి దాని పరిమాణం మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా అది మీ శరీర ఆకృతికి నప్పెలా ఉండాలి. పొట్టిగా ఉన్నవారికి పెద్ద బ్యాగులు అంతగా నప్పవు. సన్నగా, పొడవుగా ఉన్న వారికి కాస్త పెద్దగా ఉన్న బ్యాగులు బావుంటాయి. ఇలా ఎవరికి ఏం బాగుంటాయో చెక్ చేసుకుని, చూసుకొని కొనుక్కోవాలి.
బ్యాగు చూడడానికి అందంగా ఉంటే మాత్రమే సరిపోదు. దాంతోపాటు నాణ్యత కూడా ఉండాలి. లేదంటే అది ఎక్కువ రోజులు మన్నికగా ఉండదు. ముఖ్యంగా బరువును తట్టుకుంటాయో లేదో చెక్ చేసుకొని తీసుకోవాలి. జిప్ మరియు హ్యాండిల్ సరిగ్గా ఉన్నాయో లేదో అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఇంకా మనం తీసుకునే బ్యాగ్ వాటర్ ప్రూఫ్ అయి ఉంటే మరీ మంచిది. దీనికోసం మనం బ్యాగ్ లోపల లైనింగ్ ని కూడా గమనించవచ్చు.
కాలేజీ యువత మరియు ఫాషన్ ని ఇష్టపడేవాళ్లు పేస్టల్ కలర్స్ ఇంకా ఫ్లోరల్, ఆబ్జెక్ట్ ప్రింట్లలో వీటిని తీసుకోవచ్చు. సాధారణంగా కలర్స్ విషయానికి వస్తే బ్లాక్, బ్రౌన్, నేవీ, గ్రే వంటి రంగులు ప్రొఫెషనల్ వుమెన్ కి బాగా సూట్ అవుతాయి.
ఇటువంటి మరిన్ని ఫ్యాషన్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు రీడర్స్ ఫ్యాషన్ ని సందర్శించండి.