Home » సైనిక – నా పేరు సూర్య నా ల్లు ఇండియా

సైనిక – నా పేరు సూర్య నా ల్లు ఇండియా

by Firdous SK
0 comment

సరిహద్దున నువ్వు లేకుంటే
ఏ కనుపాప కంటి నిండుగా
నిదురపోదురా నిదుర పోదురా
నిలువెత్తున నిప్పు కంచెవై

నువ్వుంటేనే జాతి బావుటా
ఎగురుతుందిరా పైకెగురుతుందిరా
ఇల్లే ఇండియా
దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా

తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవకా ఓ సైనికా
పనిలో పరుగే తీరికా ఓ సైనికా
ప్రాణం అంతా తేలికా ఓ సైనికా
పోరాటం నీకో వేడుకా ఓ సైనికా

దేహం తో వెళ్ళిపోదీ ఈ కథ
దేశంలో మిగిలుంటుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు
నువ్వో స్పూర్తి సంతకం

పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా
పుస్తెలు లక్ష్య పెట్టవే ఓ సైనికా
గస్తీ దుస్తులు సాక్షిగా ఓ సైనికా
ప్రతి పూటా నీకో పుట్టుకే ఓ సైనికా

బతుకిది గడవదు అని
నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని
నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని
బలమగు భక్తుడని

వేలెత్తి ఎలుగెత్తి భూమి
పిలిచింది నీ శక్తిని నమ్మి
ఇల్లే ఇండియా
దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా

తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండె భాస్వరం ఓ సైనికా
జ్వాలాగీతం నీ స్వరం ఓ సైనికా
బతుకే వందేమాతరం ఓ సైనికా
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనికా


పాట: సైనిక
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: విశాల్ దద్లానీ
చిత్రం: నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా
తారాగణం: అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్
సంగీత దర్శకుడు: విశాల్, విశాల్ శేఖర్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment