చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు చిక్కు చిక్కు చు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు చిక్కు చిక్కు చు
అక్షరాల తోటలోన
ఆడుతున్నా చిన్ని చిన్ని తూనీగలం
పుస్తకాల చెట్టుకింద
ఊగుతున్నా చిట్టి పొట్టి చిన్నారులం
అమ్మపాట వింటూనే అ ఆ లు
ఇడ్లి వడ తింటూనే ఇ ఈ లు
అంతా కూడి ఆడి పాడి
పడిలేస్తూ నవ్వేస్తూ నేర్చేసుకుంటాం
నల్లని మబ్బులు మెల్లగ కమ్మేస్తే
చల్లంగా వానొచ్చును లే
వానొచ్చి వరదొస్తే
వాగుల్లో వంకల్లో
చెరువుల్లో నీరొచ్చే లే
చెరువుల్లో నీరొస్తే
చేలన్నీ తడిసేను
పంటలు పండేను లే
వరిపంటనే తెచ్చి
మా అమ్మ వండింది
తియ్యని పరమాన్నమే
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు
చిక్కురు చిక్కు చిక్కు చిక్కు చు
ఓ చిట్టి చిలకమ్మ తోటకు వెళ్ళింది
తోటలో ఓ జామ పండును కొరికింది
నాకూడా ఇవ్వంటే ఇవ్వదుగా
అంతలో ఓ ఉడుత అటువైపు వచ్చి
చిలకమ్మతో వాదులాడింది కాసేపు
చిలకేమో పైకెగిరి పోయనుగా
ఎగిరే ఆ పిట్టకు చెరువులో చేపకు
ఎవ్వరు చెప్పారు ఆటలన్నీ
మనసుంటే చాలు కదా నేర్చుకోవచ్చులే అన్నీ
అమ్మపాట వింటూనే అ ఆ లు
ఇడ్లి వడ తింటూనే ఇ ఈ లు
అంతా కూడి ఆడి పాడి
పడిలేస్తూ నవ్వేస్తూ నేర్చేసుకుంటాం
డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డి
డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డిప్పిరి డి
డిప్పి డిప్పి డిప్పి డిప్పి డీ
ఎంచక్కా ఆడుతూ పాడుతూ ఉంటాము
కాస్తఅంత చేస్తూనే ఉంటాము
మీరైనా చిన్నప్పుడు ఇంతేగా
మాటికీ మాటికీ మారాలు చేస్తాము
మారాలు చేస్తూనే మీ మాట వింటాము
మా వెనకే మీరుంటే సరిపోదా
ఎగిరే గాలిపటమే గా మా చిన్నిమనసు
మా చిన్నిమనసు
పాఠశాల అయినదా చెరసాల
బుర్రనిండా బరువులే మొయ్యాలా
గాలి నీరు నింగి నేల
ఈ ప్రకృతే మనకు ఓ పాఠశాల
నల్లని మబ్బులు మెల్లగ కమ్మేస్తే
చల్లంగా వానొచ్చును లే
వానొచ్చి వరదొస్తే
వాగుల్లో వంకల్లో
చెరువుల్లో నీరొచ్చే లే
చెరువుల్లో నీరొస్తే
చేలన్నీ తడిసేను
పంటలు పండేను లే
వరిపంటనే తెచ్చి
మా అమ్మ వండితే
తియ్యని పరమాన్నమే
పాట పేరు (Song Name) : చిక్కురు చిక్కు (Chikkuru Chikku)
సినిమా పేరు (Movie Name) : అనగనగా (Anaganaga)
గానం (Singer) : సాయి వేద వాగ్దేవి, ప్రాధాన్య, మనోఘ్న & తనిష్క (Sai Veda Vagdevi, Pradhanya, Manoghna & Tanishka)
సాహిత్యం (Lyrics) : రెహమాన్ (Rahman)
సంగీతం (Music) : Chandu, Ravi (చందు, రవి)
దర్శకుడు (Direction) : సన్నీ సంజయ్ (Sunny Sanjay)
తారాగణం (Movie Cast) : సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి (Kajal Choudhary), మాస్టర్ విహార్ష్ (Master Viharsh), అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) తదితరులు
👉 ఇంకా ఇటువంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!