చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది
తుళ్లి తుళ్లి ఆడుకుంటూ ఏ చోట ఆగను అంది
నింగిలోని నీలిమేఘమేమి అన్నది
రాగాలు పాడుకుంటూ హాయిగా
తేలి తేలి పొమ్మన్నది
నాతో కలిసి రమ్మన్నది
గాలిలోన గువ్వలాగా నిను ఆడుకోమన్నది
ఏలేలేలో ఏలేలేలో
ఏలేలే ఏలేలో ఏలేలేలో
ఏలేలేలో ఏలేలేలో
ఏలేలే ఏలేలే ఏలేలేలో
ఎండా వానా వస్తూ ఉన్నా
పగలూ రేయి అయిపోతున్నా
సీతాకోక రెక్కల్లోనా
ఎగిరెళ్లె చిరు ఆశ చల్లారునా
ఉన్నకొంత కాలమైనా నవ్వుతూ అలా
రంగు రంగు పూలలోని తేనె పాటనీ
పాడేస్తూ పూట పూట తియ్యగా
సాగి సాగి పోవాలని
ఆగి పోనే పోరాదని
ఆరి రారో ఆ రా రి రో
ఆరి రారో ఆ రా రి రో
వాలుతున్న పొద్దు నీతో ఓ మాట అంటున్నది
నీకు నువ్వే తోడు ఉంటే ఏ లోటు లేదన్నది
రేయిలోన జాబిలమ్మ పాడుతున్నది
నీకోసం లాలిపాట కమ్మగా
లాలి లాలి జో లాలిజో..
లాలి లాలి జో లాలిజో..
లాలి లాలి జో లాలిజో..
లాలి లాలి జో లాలిజో..
పాట పేరు (Song Name) : చూడు చూడు (Chudu Chudu)
సినిమా పేరు (Movie Name) : అనగనగా (Anaganaga)
గానం (Singer) : విజయ్ యేసుదాస్ (Vijay Yesudas)
సాహిత్యం (Lyrics) : రెహమాన్ (Rahman)
సంగీతం (Music) : Chandu, Ravi (చందు, రవి)
దర్శకుడు (Direction) : సన్నీ సంజయ్ (Sunny Sanjay)
తారాగణం (Movie Cast) : సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి (Kajal Choudhary), మాస్టర్ విహార్ష్ (Master Viharsh), అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) తదితరులు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!