అగ్గో కత్తెర జుంపాలోడే కళ్లెం వేసి లాగినాడే
చూస్తూ చూస్తూ నేనిట్టా ఆనికి సోపతి అయినానే
మాటలు జెప్పే మాయలోడే మంత్రంయేసి లాగినాడే
మందేబెట్టి నట్టయింది ఇట్టా ఆన్ని మరిసిపోనే
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
అగ్గో కత్తెర జుంపాలోడే కళ్లెం వేసి లాగినాడే
చూస్తూ చూస్తూ నేనిట్టా ఆనికి సోపతి అయినానే
నవ్వుతో నన్నే ముంచినాడే గుండెకు సప్పుడు పెంచినాడే
నన్నే నేను మరిసిపోయేంత ప్రేమను నాలో పెంచినాడే
సప్పుడుజేయక చేరినాడే ఊపిరినే జతచేసినాడే
ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా సిక్కని సక్కని సెందురుడే
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
వాడు తాకితే తనువే గిల్లా గిల్లా ఎప్పుడుగిట్టా కాలేదుల్లా
కాళ్లకు తెలియని నడకలు నాయి ఎటుబోతున్న ఎమోనుల్లా
నిప్పులుబట్టిన నీళ్ళతీరు కంపలో నడిసిన దూదితీరు
ఉల్టా పల్టా అయినదే జిందగీ జారిపోతినమ్మా వాని వళ్ళో
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
రాసుకున్న గుండెమీద ఆని పేరే పచ్చబొట్టులాగ
ఉండిపోర పిల్లగాడ వేయిజన్మాలకు తోడు నీడగా
ఇచ్చేసుకున్నా నన్ను నేను కట్టేసుకుంటా వాన్ని నేను
ఎట్టాగైనా పట్టేసుకుంటా ఎక్కడ ఉన్నా వాన్ని నేను
రబ్బరుబుగ్గల పిల్లగాడు రెబ్బెలపూల అంగిలోడు
రబ్బరుగాజులు తేను బోయి రాలేదమ్మా ఇంకా వాడు
వేచివున్నా పిల్లగాడ వేయికళ్లతో నిను చూడా
వచ్చిపోర పిల్లగాడ వేయిజన్మలైన నిను వీడ

👉 ఇంకా ఇటువంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!