చేతికి గాజులుయేసి మూతికి లిప్‌స్టిక్ రాసి
చెంపకు పౌడారు బూసి ఇంపుగా ఇగసొంపుగా
మంచి సీరగట్టుకోని మల్లెపూలుబెట్టుకోని
గల్లీనుండి నడిసి నేను మెల్ల మెల్లగోచ్చేదాకా
ఆగుమంటే ఆగడే ఆగుమంటే ఆగడే
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
ఆగమే జేస్తడే ఆటో రిక్షోడు
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
హరను గోడతడే ఆటో రిక్షోడు
హైదరబాదులో కొన్న అత్తరునే గొట్టుకోని
ఎండవేడి తగలకుండా సెత్తిరినే బట్టుకోని
కండ్లకు సలువా నల్లని అద్దాలు బెట్టుకోని
గాలిదూళి బడకుండా నిండ కొంగు జుట్టుకోని
ఎత్తుసెప్పులేసుకోని కొత్తతనం బూసుకోని
నాకు నేను నచ్చేదాకా ఆగడమే వచ్చేదాక
ఆగుమంటే ఆగడే ఆగుమంటే ఆగడే
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
ఆగమే జేస్తడే ఆటో రిక్షోడు
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
హరను గోడతడే ఆటో రిక్షోడు
ఆ.. ముద్దబంతి నా మొఖముము అద్దంలో జూసుకుంటా
సెక సెక మెరిసేటి సెవుల దుద్దులు సరిజేసుకుంటా
సుక్కలాంటి ముక్కుపుల్ల సూటుకేసు నుండీ దీసీ
సిక్కులుబడ్డా కురులకు సిన్నంగా నూనె రాసి
అరచేతిలా గోరింటా ఎర్రంగా పండే దాకా
అందమైన నా మనసు నిమ్మలంగా ఉండే దాకా
ఆగుమంటే ఆగడే ఆగుమంటే ఆగడే
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
ఆగమే జేస్తడే ఆటో రిక్షోడు
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
హరను గోడతడే హే ఆగవయ్యా బాబు
సినిమాలో శ్రీదేవికి సిన్నసెల్లి లెక్కుంటా
సిలకలాంటి సిన్నదాన్ని ఎందుకు తగ్గాలంట
కాటుక దిద్దూకుంటే కళ్ళుమెరిసిపోవాలే
నన్ను జూసి పొగుడుకుంటే నేను మురిసిపోవాలె
బొమ్మలనడుమ బొట్టుబెట్టి సెల్లుఫోను సేతబట్టి
ఇంటిబీడం బట్టెనాక బయటడుగు బెట్టేదాకా
ఆగుమంటే ఆగడే ఆగుమంటే ఆగడే
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
ఆగమే జేస్తడే ఆటో రిక్షోడు
ఆగుమంటే ఆగడే ఆటో రిక్షోడు
హరను గోడతడే ఆటో రిక్షోడు
👉 ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!