Home » కిచి కిచి కిచి కియ్యా సాంగ్ లిరిక్స్ – ప్రేమ ఖైదీ (2011)

కిచి కిచి కిచి కియ్యా సాంగ్ లిరిక్స్ – ప్రేమ ఖైదీ (2011)

by Vinod G
0 comments
prema khaidi songs lyrics telugu

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో

చికు చికు పుల్లాట చక చక ఆడేద్దాం..
అల్లరి ఆటలు ఆడుకుంటూ పల్లెపాటే పాడేద్దాం
నేర్పిస్తాను ఖో ఖో
అచ్చంగాయాలు తెచ్చుకో
వామన గుంటలు ఆడుకుంటూ పాము గుడ్లే పట్టుకో
పుల్లాటే ఆడాలా మేక పులి ఆడాలా
తాటిపండు బండేకట్టి ఊడల ఉయ్యాలూగాల

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో

ఎర్రమట్టి నేలమీద కర్రబిళ్ళ ఆడేద్దాం
పిచ్చుకగూట్లో గుడ్లను తీసి కాకిగూట్లో పెట్టేద్దాం
లక్కపిడతల్లోన వంటే వండి పెట్టేద్దాం
డిక్కిల్లోన ఆడి స్కిప్పింగ్ ఆట ఆడేద్దాం
ఉప్పుమూట ఎత్తుకొని ఊరంతా తిరిగొచ్చేద్దాం

కరివేపాకు పొదల వెంట కాళ్ళరిగేలా నడిచేద్దాం
కట్టివేసి తొండ నోట్లో పొగాకుకాడ పెట్టేద్దాం
గులకరాళ్లు ఏరి గుట్టగ పోసి చెరిపేద్దాం
కాలువనీళ్లలోన కప్పపిల్లలు పట్టేద్దాం
చీట్లపేక ముక్కలతోటి లోన బయట ఆడేద్దాం

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో

గాలిపటం ఎగరేసి ఆకాశానికి పంపేద్దాం
బొమ్మలాగ వేషం వేసి వంగి వంగి నడిచేద్దాం
వేపకాయలు యేరి గోనెసంచిలో దాచేద్దాం
గచ్చకాయ రుద్దేసి వాతలు పెట్టి నవ్వేద్దాం
క్యాడ్బాల్ చేసి దాంతో మనము చింతకాయలు రాల్చేద్దాం
చికు చికు పుల్లాట చక చక ఆడేద్దాం..
అల్లరి ఆటలు ఆడుకుంటూ పల్లెపాటే పాడేద్దాం

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో

కిచి కిచి కిచి కియ్యా
కిచి కిచి కిచి కియ్యా
కో కో
కో కో


పాట పేరు (Song Name) : కిచి కిచి కిచి కియ్యా (Kicha Kicha Kiya)
సినిమా పేరు (Movie Name) : ప్రేమ ఖైదీ (Prema Khaidi) 2011
గానం (Singer) : బేబీ హరిణి (Baby Harini), శ్రీరంజని (Sriranjani)
సాహిత్యం (Lyrics) : G అత్రేయ (G Athreya)
సంగీతం (Music) : యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
దర్శకుడు (Direction) : ప్రభు సోలమన్ (Prabhu Soloman)
తారాగణం (Movie Cast) : విదార్థ్ (Vidhaarth), అమలా పాల్ (Amala Paul) తదితరులు

👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.